నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. అనుపమయాదవాన్వయ మధాబ్దిసుధానిధి కృష్ణమూర్తి నీ
కనుజుఁడుగా జనించి, కుంజనావళి నెల్ల నడించి, రోహిణీ
తనయుఁడంగ బాహఉ బల దర్పమునన్ బలరామ మూర్తివై
తనరివ వేల్పనీవె గద దాశరథీ కరుణాపయోనిధీ

భావం: దశరథ రామా! యాదవ వంశంలో శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు తమ్ముడుగాను, రోహిణీదేవి గర్భంలో జన్మించి భుజ బలాతిశయం చేత దుష్ట జనసమూహాలను అందరినీ రూపుమాపే బలరాముడనే పేరుతో అవతరించిన దేవుడవు. శ్రీమన్నారాయణుడవు నీవేకదా.

వ్యాఖ్యానం : శ్రీమద్భాగవతంలో బలరామకృష్ణులను అవతార పురుషులను చెప్పారు. కాని శ్రీకృష్ణుడు భగవానుడుగా పేర్కొనబడడం చేత బలరాముణ్ణి తొమ్మిదవ అవతారంగా భావిస్తారు. సాయాత్తు శ్రీకృష్ణ లీలాసహాయకుడు బలరాముడ అగ్ని పురాణం బలరాముని నవమాతారంగాను. అనంత మూర్తిగాను వర్ణించింది. శ్రీకృష్ణ లీలలకు సాక్షాత్తు బలరాముడే సహాయకుడుగా ఉన్నాడు. శ్రీకృష్ణుని అంశంతోనే జన్మించినవాడు. చతుర్భుజత్వము గల ధారిత్వము కలిగి శంఖము, ముసలము ధరించినట్లుగా వర్ణితమైనవాడు. అనిరుద్ద, ప్రద్యుమన్న సంకర్షణ వాసుదేవమనే చతుర్విధ వ్యూహాలతో ఉద్భవించినవాడు శ్రీ కృష్ణుడు. ఆ వ్యూహంలో సంకర్షణుడే బలరాముడు. కనుక బలరాముడు కూడా దేవాదిదేవుడైన మహావిష్ణువే. బలరామకృష్ణులు లౌకికంలో అన్నదమ్ములు. ఆధ్యాత్మికభూమిలో ఒక్కరే.