నేర్చుకుందాం

శివనామాలు (తేటగీతి సుమాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

9. ఓం యజ్ఞమయాయ నమః
లోక కళ్యాణకరము శుభాకరమ్ము
వాయుకాలుష్యధూమ శుభ్రప్రదమ్ము
వర్షధారాగమన మంత్ర పఠన గళము
యజ్ఞమది -‘యజ్ఞమయు’డైన హనునుతింతు

10. ఓం సోమాయనమః
‘పతికి అర్థాంగి’యన అర్థవంతమగుచు
భర్తరాగము యావత్తు భార్యయనగ
సకల సద్గుణ సౌశీల్య సతి శివాని
స ఉమ -‘సోమ’ నాముడు నన్ను సంస్కరించు

11.ఓం పంచవక్త్రాయనమః
తొలిముఖమ్ము తత్పురుషము తూర్పువైపు
పశ్చిమమును సద్యోజాత వదనము కను
దక్షిణ మఘోర ముఖము ఉత్తరము వామ
దేవ మకాశ మీశాన దృష్టియుండు
పంచముఖుని రేబవలు నే ప్రస్తుతింతు

12.ఓం సదాశివాయ నమః
మంగళప్రదుడు సదా శుభాంగమూర్తి
కోపము నటించి సరిదారి చూపుగురుడు
చేతు చెడును తీసి, మంచిని చేదుకొనెడు
ఆ ‘సదాశివు’ దాసానుదాసుడేను

కడియాల మధుసూదన రావు 9030907191