నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ఎఱుక గలవారి చరితలు
గఱచుచు సజ్జనుల గోషిఠఁ గదలక ధర్మం
బెఱుఁగుచు నెఱిఁగిన దానిని
మఱవ కనుష్ఠించునది సమంజసబుద్ధిన్
భావం: జ్ఞానం కలవారి చరిత్రలు అభ్యసిస్తూ సజ్జనుల సల్లాపమందు కదలకుండా ధర్మం తెలిసికొంటూ తెలిసికొన్నదానిని మరిచిపోకుండా న్యాయంతో కూడిన బుద్ధితో చేయాలి. రాజ్యభోగాలను, ఐహిక సుఖవాంఛలను వదిలి పూరునికి ఆయన ఇచ్చిన ముదిమిని ఇచ్చివేసి రాజ్యాన్ని కూడా కట్టబెట్టిన యయాతి తపోవనాలకు వెళ్లాడు .అక్కడ నియమ నిష్టలతో ఎన్నో ఏండ్లు తపస్సు చేశాడు. ముప్పైఏళ్లు ఆహారం లేకుండాను, కేవలం వాయుభక్షణతో ఒక సంవత్సరం పంచాగ్నుల మధ్య నిలబడి కూడా తపస్సు చేశాడు. అట్లా చేసినందువల్ల దైవానికి యయాతి ప్రీతుడయ్యాడు. యయాతి చేసిన పుణ్యంకొద్దీ సత్య,ఇంద్రలోకాలకు వెళ్లగా అక్కడ యయాతికి గౌరవ మర్యాదలు చేసి రాజ్యభారాన్ని అప్పగించిన పూరునకు ఏమి బోధ చేశావని ఇంద్రుడు అడుగగా పైవిధంగా యయాతి పూరునకు చెప్పిన విషయాన్ని చెప్పాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము