నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ. సర్వభూత దయకు సత్యవాక్యమునకు
నుత్తమంబు ధర్మువొండెఱుంగ
నొరుల నొప్పి కోడ కువతాపమొనరించు
నదియ కడు నధర్మమనిరి బుధులు
భావం: ఎల్లజీవుల యందు దయ కలిగి ఉండటం కంటెను, నిజమైన వాక్యం పల్కటం కంటెను, శ్రేష్ఠమైన ధర్మమింకొకటి నాకు తెలియదు. ఇతరులను బాధించటాని జంకక, సంతాపం కలుగ చేయటం మిక్కిలి అధర్మమని పండితులు చెప్పారు. స్వర్గలోకానికి వెళ్లిన యయాతి ఇంద్రుడితో మాట్లాడేటపుడు తాను ఆచరించిన తపస్సును గూర్చి చెపుతూ శ్రేష్ఠులైన వారిని కించపరిచాడు. దానితో అతనిని నక్షత్రలోకానికి యయాతిని ఇంద్రుడు పంపించివేశాడు. అక్కడ తన మనుమలైన అష్టకుడు లాంటివారిని యయాతి చూచాడు. వారు యయాతిని గుర్తించి అక్కడికి రావాడానికి కారణాలు తెలుసుకొని మాకు మంచి చెడ్డగతుల స్వభావాలను వర్ణాశ్రమ ఆచారాలను తెలుపమని అడిగారు. వారికిమంచిని గూర్చి యయాతి చెబుతూ దయ కలిగి ఉండటం, సత్యాన్ని పల్కటం కంటె వేరు మంచి ఉండదని చెప్పారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము