నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. గరుడ వాహన ! దివ్యకౌస్త్భులంకార!
రవికోటి తేజ ! సారంగవదన!
మణిగణాన్విత హేమముకుటాభరణ! చారు
మకరకుండల! లసన్మందహాస!
కాంచనాంబర!రత్నకాంచీవిభూషిత!
సురవరార్చిత! చంద్రసూర్య నయన!
కమలనాభ! ముకుంద! గంగాధర స్తుత!
రాక్షసాంతక! నాగరాజశయన!
తే. పతిత పావన ! లక్ష్మీశ! బ్రహ్మజనక!
భక్తవత్సల ! సర్వేశ! పరమపురుష!
భూషణ వికాస ! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!
*
భావం: ఓ నరసింహాస్వామీ! నీకు గరుత్మంతుడు వాహనం, కౌస్త్భుం ధరించావు.కోటి సూర్యుల తేజస్సు నీది. సారంగవదనుడవు. బంగారు కిరీటం తాల్చావు. మకరకుండలాలు ధరించావు. చక్కని చిరునవ్వుతో పట్టుపుట్టం రత్నాల మొలనూలు దరించి వెల్గుతున్నావు. దేవతలు నిన్నర్చిస్తారు. సూర్యచంద్రులే నీకు కళ్లు. ఆదిశేషుడు నీ పడక. పాపుల్ని రక్షిస్తావు. లక్ష్మి నీ ఇళ్లాలు. బ్రహ్మ నీకొడుకు. నీవు భక్తవత్సలుడవు. సర్వేశ్వరుడవు. నీకునమస్కారం.