నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. మానాగ్ని హోత్రమును మఱి
మానాధ్యయనమును మాన వౌనంబు నవి
జ్ఞానమున మాన యజ్ఞము
నా నయథార్థంబు లివియు నాలుగు నుర్విన్

భావం: గర్వంతో కూడిన అగ్ని హోత్రం, ఆడంబరానికై చేసే వేదాధ్యయనం , గర్వంతో కూడుకొన్న వౌనం, జ్ఞానం లేకుండా ఆడంబరంతో చేసే యజ్ఞం అనే నాలుగున్నూ భూమి యందు అసత్యాలైనవి అంటే అయోగ్యమైనవి. యయాతి తాను స్వర్గలోకంలో సంచరించే అవకాశాన్ని పొంది గూడా అహంకారమనే అవగుణం వల్ల తిరిగి అధోలోకాలకు వెళ్లేటట్లు ఇంద్రుని చేత శపించబడి , తిరిగి చేసిన పనిని క్షమించమని అడిగి నక్షత్రలోకానికి వచ్చిన యయాతి తన మనుమలకు మంచిచెడుల గతులను తెల్పుతూ ఈవిధంగా భూలోకంలో అయోగ్యమైనవేవో వివరించాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము