నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. అతిరుచిరాగతుం డయిన యాతనికిన్ హృదయప్రమోద మా
తతముగ నవ్యనంబున లతాలలనల్ మృదులానిలావన
ర్జిత కుసుమాక్షతావళులు సేసలు వెట్టినయట్లైరైరి సం
పత దళ నీ నినాద మృదుభాషల దీవన లొప్ప నిచ్చుచున్
భావం: మిక్కిలి సముచితంగా వచ్చిన ఆ దుష్యంతుడికి మనస్సులోని ఆహ్లాదం అధికమయ్యేటట్లుగా ఆ వనంలోని లతలచే వనితలు అటూ ఇటూ ఎగురుతున్న ఆడు తుమ్మెదల ఝంకార ధ్వనులనెడి మెత్తని మాటలతో తగిన విధంగా ఆశీస్సులను ఇస్తూ మెల్లని గాలుల చేత రాల్పబడిన పూవులనెడి అక్షతల సమూహాన్ని తలంబ్రాలుగా చల్లినట్లు భాసించారు. దుష్యంతుడు అలసిన దేహంతో సేద దీరడానికి కొంత దవ్వు ఏగగా అక్కడ మంచి వాసన గల పండ్లతో నిండిన వృక్షాలు, మంచి సువాసనను ఇచ్చే పూలతో నిండి ఉన్న చెట్లతో లతలుపొదలతో ఉన్న ఆశ్రమాన్ని చూచాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము