నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. క్షత్రియ వంశ్యు లై ధరణిఁగావఁగ బుట్టినవారు బ్రాహ్మణ
క్షత్రియ వైశ్యశూద్రులనఁగా నాలుగు జాతులన్ స్వచా
రిత్రము దప్పకుండఁగా బరీక్షితు కాచినయట్లు రామమాం
ధాతృరఘుక్షితీశులు ముదంబునఁ గాచిరే యే యుగంబులన్

భావం: క్షత్రియ కులానికి చెందినవారై, భూమిని రక్షించటానికి పుట్టినట్టి రాముడు, మాంధాత, రఘుమహారాజు, మొదలైన రాజులు ఏ యుగంలోనైనా బ్రాహ్మణులు, క్షత్రియులు , కోమట్లు , శూద్రులు అనే పేర్లు గల నాలుగు వర్ణాలను తమ తమ ధర్మాలను తప్పకుండ పరీక్షిన్మహారాజు రక్షించినట్లు సంతోషంతో రక్షించి ఉన్నారా? (రాముడు, మాంధాత మున్నగు వారు కూడా పరీక్షితుడు రక్షించినట్లు నాలుగు వర్ణాల ప్రజలను, తమతమ వర్ణ్ధర్మాలను తప్పకుండా రక్షించి ఉండలేదని భావం) శమీకునిపై చచ్చిన పామును పడవేసిన వెళ్లిన పరీక్షిత్తును శపించిన తన కుమారుడైన శృంగిని చూచి తాపసులకు క్షమ ఎంత అవసరమో చెబుతూ ఒక్కరాజు వల్ల రాజ్యంలోని ప్రజలందరూ బాగుంటారు. అట్లాంటి రాజునే నీవు శపించావు కదా. మరి ఇపుడు ఆ నాలుగు వర్ణాల వారిని రక్షించేవారు ఎవరు ఉంటారు అని తపస్సు నుంచి బాహ్యస్మృతిలోకి వచ్చిన శమీకుడన్న ముని ఆందోళన పడుతూ తన కుమారుడితో మాట్లాడుతున్నాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము