నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. కరుణానిపతులు ధర్మ
స్వరూపు లింతకుమదీయ జనకులు ననుదెం
తురు వారు వచ్చి నీ కీ
చ్చిరేని పాణిగ్రహణము సేయుము నన్నున్
భావం: దయాపరులు, ధర్మమే మూర్తి కట్టినవారు అయిన మా తండ్రి కణ్వ మహర్షులు ఇంతలోనే వస్తారు. వారు వచ్చి నన్ను నీకు భార్యగా కన్యాదానం చేస్తే నన్ను నీవు పెండ్లాడుము అని శకుంతల తనలో దుష్యంతునిపై పెంపొందుతున్న ప్రేమతో మాట్లాడింది.
తే. తనకు మఱి తాన చుట్టంబు తాన తనకు
గతియుఁ దన్ని చ్చుచోఁ దాన కర్త యనఁగ
వనజ నేత్ర ! గాంధర్వ వివాహ మతి ర
హస్యమును నమంత్రకమును నగుచు నొప్పు
భావం: ఓ కమలనేత్రా! తనకు తానే చుట్టం కావటం , తనకు తానే దిక్కు కావటం తనను తాను ఇచ్చుకుంటున్నప్పుడు తానే కర్త కావటం అనే లక్షణాలతో ప్రసిద్ధి చెందిన గాంధర్వ వివాహం మిక్కిలి గోప్యంగాను మంత్ర తంత్ర రహితంగాను ఉంటుంది అని దుష్యంతుడు గాంధర్వ వివాహం ప్రవర్తిల్లే పద్ధతిని చెప్పే శకుంతలను ఒప్పించడానికి ప్రయత్నించాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము