నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే. తల్లి నీ కుల గోత్ర సౌందర్యములకుఁ
దగిన పతిఁ గంటి దానికి దగఁగ గర్భ
మయ్యె నీదు గర్భమున వాఁ డఖిల భువన
వహన మహనీయుఁడగు చక్రవర్తి సుమ్ము
భావం: అమ్మా! నీ కుల గోత్రాలకు అందచందాలకు తగిన భర్తను నీవు పొందగలిగావు. దానికి తగినట్లుగా నీవు గర్భవతివి కూడా అయినావు. నీ గర్భంలో ఉన్నవాడు ఈ సమస్త్భూమిని పాలించగలిగిన మహనీయుడయ్యే చక్రవర్తి సుమా! దుష్యంతుడు శకుంతలను గాంధర్వ విధిన వివాహమాడి తన మంత్రులను కణ్వమహర్షి దగ్గరకు పంపుతానని చెప్పి నగరానికి వెళ్లిపోయాడు. శకుంతల తన తండ్రి వచ్చి తాను చేసిన పనికి కోపగిస్తాడేమో నని ఓ ప్రక్క భయపడుతూ దుష్యంతుడు చూపిన ప్రేమోదంతానికి ఓ పక్క సిగ్గిల్లితూ ఆశ్రమంలో చూచిన కణ్వమహర్షి తన దివ్యదృష్టితో జరిగిన విషయాన్ని తెలుసుకొని భయపడుతున శకుంతలతో ఈవిధంగా మాట్లాడాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము