నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ. ఎట్టి సాధ్వులకును బుట్టిన యిండ్లను
బెద్దకాల మునికి తద్ద తగదు
పతుల కడన యునికి సతులకు ధర్మువు
నతుల కేడుగడయుఁ బతుల చూవె
భావం: ఎటువంటి పతివ్రతుల కైనా పుట్టినిళ్లలో ఎక్కువ కాలం ఉండటం ఎంతమాత్రం ఉచితం కాదు. ఇల్లాళ్లకు భర్తల దగ్గర ఉండటమే ధర్మం. భార్యలకు భర్తలే సర్వ రక్షకులు (ఏడుగడలు)సుమా.
క. గురునాశ్రమంబునను ము
న్నరుదుగఁ బతి వలనఁగనిన యనురాగము నా
దరణము నను గ్రహంబును
గరుణయుసంభ్రమము నపుడు గానక యెడలోన్
భావం: పూర్వం తండ్రి ఆశ్రమంలో అపూర్వంగా తన పతి తన పట్ల చూపిన వలపును ఆదరాన్నీ, దయనూ, ఆసక్తినీ అప్పుడు కానక హృదయంలో మాట్లాడుకోసాగింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము