నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. విను గార్హపత్యమను న
య్యనలము బహరింపఁబడి తలాహవనీయం
బున వెలుఁగునట్ల వెలుఁగును
జనకుఁడు దాఁ బుత్రు డై నిజద్యుతి తోడన్
భావం: గార్హపత్యం అనబడే అగ్ని ప్రజ్వలింపబడి ఏవిధంగా అహవనీయంలో వెలుగొందుతుందో ఆ విధంగానే తండ్రి తానే పుత్రుడై తన ప్రకాశంతో వెలుగొందుతాడు. దీనిని తెలుసుకొనుము. అని దుష్యంతునికి శకుంతల చెపుతూ భార్యభర్తలో సగం కాబట్టి మగని కంటె ముందు చనిపోయిన పతివ్రత పరలోకంలోకూడా తన భర్తతో కూడి ఉండాలని అతడి రాకకోసం ఎదురుచూస్తుటుంది. భర్త ముందుగా చనిపోతే తాను కూడా వెనువెంట వెళ్లి భర్తను కూడుకునే భార్యను అవమానించటం ధర్మవిరోధం. అంతేకాదు భర్త భార్యయందు ప్రవేశించి గర్భంలో వసించి పుత్రుడై జన్మిస్తాడు. కనుక ఈ పుత్రుని చూచినపుడు తండ్రి అమిత మైన సంతోషాన్ని పొందుతాడు తండ్రీ కొడుకుల సంబంధబాంధవ్యాలను పలికింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము