నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. భూరిగుణు నిట్టి కులది
స్తారకు దారకు మదారధర్మప్రియ ని
ష్కారణమ తప్పఁ జూడఁగ
సారమతీ! చనునె నాఁటి సత్యము గలుగన్

భావం: ఉత్తమ ధర్మప్రియా! సారమతీ!మన వివాహ మైన నాడు నా కిచ్చిన వరమనే సత్యం నిలచి ఉండగా అపార గుణవంతుడు, వంశవిస్తారకుడు అయిన పుత్రుడిని ఏ కారణం లేకుండానే కాదనటం తగునా? అని దుష్యంతునితో శకుంతల తన్ను గాంధర్వవిధిన కణ్వుడు లేని సమయంలో ఆ కణ్వాశ్రమంలో పెళ్లాడిన సంగతి చెప్పింది. ఆ పెళ్లి సమయంలో నీవు నాకు వాగ్ధానం చేసిన సంగతి మరిచినట్లు ఉన్నావు కేవలం నీ వాగ్ధానాన్ని నేను ఒక్కదానే్న వినలేదుకదా. నాతో పాటు పంచభూతాలు సర్వసాక్షి అయిన భగవంతుడు కూడా వినే ఉన్నాడు కదా. అటువంటపుడు నీవు ఏవిధంగా నన్ను తెలియదని అంటావు అని శకుంతల దుష్యంతునితో అన్నది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము