బిజినెస్

మ్యాగీ పోయి.. పాస్తా వచ్చే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెరపైకి నెస్లే పాస్తా భద్రతా ప్రమాణాలు
పరిమితికి మించి సీసం ఉందంటున్న యుపి ల్యాబ్
ల్యాబ్ పరీక్షల విశ్వసనీయతను ప్రశ్నించిన నెస్లే ఇండియా
తమ ఉత్పత్తుల వినియోగం 100 శాతం సురక్షితమేనని స్పష్టీకరణ

న్యూఢిల్లీ, నవంబర్ 28: మ్యాగీ నూడుల్స్ వివాదం నుంచి బయటపడ్డామనుకుంటున్న నెస్లే ఇండియాకు ఇప్పుడు మ్యాగీ పాస్తాతో సమస్యలు వచ్చిపడ్డాయి. ఆరోగ్యానికి హాని కలిగించే స్థాయిలో నెస్లే పాస్తాలో సీసం (లెడ్) ఉందని ఉత్తరప్రదేశ్‌లోని లక్నో లాబొరేటరీ తాజాగా పేర్కొంది. ఇంతకుముందు మ్యాగీలోనూ మోతాదుకు మించి మోనోసోడియం గ్లూటమేట్, లెడ్ ఉందని ఉత్తరప్రదేశ్‌కే చెందిన బారాబంకి జిల్లాకు చెందిన ఆహార భద్రత అధికారులు ఫిర్యాదు చేసినది తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ అదే రాష్ట్రానికి చెందిన ల్యాబ్‌లో నెస్లే పాస్తా భద్రతా ప్రమాణాలపై అనుమానాలు చెలరేగడం గమనార్హం. ఈ ఏడాది మే నెలలో తెరపైకి వచ్చిన ఈ అంశం నెస్లే ఇండియాను కుదిపేయగా, ఆ సంస్థ మార్కెటింగ్‌పై తీవ్రంగానే ప్రభావం చూపింది. కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లగా, మ్యాగీపై భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) నిషేధం కూడా విధించింది. దీంతో న్యాయపోరాటానికి దిగిన నెస్లే ఇండియా.. పలు ల్యాబ్‌లలో నిర్వహించిన పరీక్షల్లో మ్యాగీ సురక్షితమేనన్న నివేదికల ఆధారంగా చివరకు బాంబే హైకోర్టు ఆదేశాల ద్వారా తిరిగి మ్యాగీని మార్కెట్‌లోకి తెచ్చుకోగలిగింది. అయితే బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ, ప్రస్తుతానికైతే మ్యాగీ మార్కెట్‌లో సేల్ అవుతోంది. దీంతో ఊపిరి పీల్చుకున్న నెస్లే ఇండియాకు ఇప్పుడు పాస్తాతో తలనొప్పులు అదే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి మొదలయ్యాయి. లక్నోలోని ప్రభుత్వ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ అయిన నేషనల్ ఫుడ్స్ అనాలిసిస్ లాబొరేటరీ.. నెస్లే పాస్తాలో ఆమోదయోగ్య స్థాయిని దాటి లెడ్ ఉందని పేర్కొంది. శుక్రవారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ఈ మేరకు ప్రకటించారు. నెస్లే ఉత్పత్తుల పంపిణీదారైన శ్రీజి ట్రేడర్స్ నుంచి పాస్తా శాంపిల్స్‌ను సేకరించామని, ఈ ఏడాది జూన్ 10న లక్నోలోని ప్రభుత్వ ల్యాబ్‌కు పంపామని, వీటిలో వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగించే స్థాయిలో లెడ్ ఉన్నట్లు తేలిందని మావో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అర్వింద్ యాదవ్ తెలిపారు. సెప్టెంబర్ 2న తమకు అందిన ల్యాబ్ రిపోర్టుల ప్రకారం నెస్లే పాస్తాలో లెడ్ పరిమాణం 2.5 పిపిఎమ్‌కు బదులుగా 6 పిపిఎమ్ ఉందని తేలిందన్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఓ లేఖ ద్వారా ఇక్కడి మోదీనగర్ నెస్లే కంపెనీకి పంపించామని, అయితే అది మళ్లీ తమకు తిరిగి వచ్చిందన్నారు. ఈ క్రమంలో నెస్లే ఇండియా అధికార ప్రతినిధి శనివారం స్పందిస్తూ తమ సంస్థ ఉత్పత్తులు 100 శాతం సురక్షితమేనన్నారు. అసలు పాస్తా శాంపిల్స్‌ను పరీక్షించిన ల్యాబ్‌కు గుర్తింపు ఉందా? అని ప్రశ్నించారు. నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ లాబొరేటరీస్ (ఎన్‌ఎబిఎల్) గుర్తింపుగాని, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ గుర్తింపుగాని ఉందా? అన్నారు. గుర్తింపులేని అనామక ల్యాబ్‌లలోని పరీక్షల ఫలితాలను నమ్మవద్దని పేర్కొన్నారు. అయినా ఈ ల్యాబ్ ఫలితాలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేశారు. కాగా, మీడియాలోనే పాస్తాపై ఆరోపణలు వచ్చాయన్న ఆయన దీనిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. ఈ అంశాన్ని పరిష్కరించడానికి సబంధిత అధికారులతో కలిసి ముందుకెళ్తామని చెప్పారు. మొత్తానికి మ్యాగీ వివాదం సర్దుకుందనుకునేసరికే పాస్తా వ్యవహారం తెరపైకి రావడంతో నెస్లే ఇండియా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నెస్లే ఆదాయంలో మ్యాగీ, పాస్తా తరహా అమ్మకాల ద్వారా వచ్చేదే అధికం. మ్యాగీపై నిషేధం నేపథ్యంలో 17 ఏళ్ల తర్వాత నెస్లే ఇండియా త్రైమాసిక ఫలితాలు నష్టాలను చూపించడం గమనార్హం. సుమారు 350 కోట్ల రూపాయల మ్యాగీ ప్యాకెట్లను నెస్లే ధ్వంసం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో 64.40 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఏప్రిల్-జూన్‌లో 287.8 కోట్ల రూపాయల లాభాన్ని నెస్లే అందుకుంది. ఈ ఏడాది జనవరి-మార్చిలోనూ 320 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. దేశీయ స్టాక్‌మార్కెట్లలోనూ నెస్లే ఇండియా షేర్ల విలువ అమాంతం పడిపోయింది. వేల కోట్ల రూపాయల్లో మదుపరుల సంపద ఆవిరైపోయం ది. ఫలితంగా చివరకు ఈ స్విట్జర్లాండ్ దిగ్గజం కోసం ఆ దేశ ప్రభుత్వమే స్పందించాల్సి వచ్చింది. మ్యాగీ వ్యవహారం విదేశీ పెట్టుబడులకు భారత్‌లో విఘాతం కలిగిస్తోందని స్విస్ దౌత్యవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదిఏమైనప్పటికీ మ్యాగీ నిషేధం తొలగడంతో ఇప్పుడిప్పుడే మార్కెట్‌లో మళ్లీ పుంజుకుంటున్న వ్యాపారం.. పాస్తా వ్యవహారంతో దెబ్బతింటుందా? అన్న ఆందోళన నెస్లేలో కనిపిస్తోంది. కాగా, ప్రస్తుతం మార్కెట్‌లో నెస్లే పాస్తా నాలుగు రకాల ఫ్లేవర్లలో లభిస్తోంది. మసాలా పెన్ని, చీజ్ మకరాని, మశ్రూమ్ పెన్ని, టొమాటో ట్విస్ట్ రుచుల్లో అందుబాటులో ఉంది.