మంచి మాట

నియంత్రణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్య జీవితంలో మనిషి ఎనె్నన్నో కలలు కంటూ వాటిని నిజం చేసుకునేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతుంటాడు. కొందరు కళల పట్ల ఆసక్తిని పెంచుకుంటూ కళాభిమానులుగా కళాకారులుగా రాణిస్తుంటారు. కలలు నిజమవడమైనా కళల్లో రాణించడమైనా భగవదనుగ్రహం తప్ప మరొకటి కాదంటారు. ప్రతి చిన్న విషయానికి గోల చెయ్యడం తప్ప మరొకటి తెలియనివారు మనిషిలోని సున్నితత్వాన్ని, దైవత్వాన్ని ఎంత మాత్రం అర్థం చేసుకోకపోగా తమకు తెలిసిందే జ్ఞాన సర్వస్వంగా తామున్న తీరే సరైనదన్నట్లు భ్రమిస్తుంటారు. కళ్లు మూసి తెరిచే లోపు ఊహించని సంఘటనలెన్నో తమ కళ్ల ముందే జరుగుతున్నా వాటినుంచి గుణపాఠాలు నేర్చుకుంటున్న వారి సంఖ్య అతి స్వల్పమే! ఒకింత వినయం, మరికొంత ఆత్మ విమర్శ మొదలైన చోట అహంకారాలకు, అతిశయాలకు చోటుండక దిద్దుబాటు చర్యలు మొదలవ్వాల్సిందే. కొండంత భక్తికైనా తగినంత శక్తికైనా మూలం చిరు ప్రయత్నమే కదా!
తన శక్తి, తన సంపద, ఆ మాటకొస్తే తన సర్వస్వం తన తెలివితేటలవల్లనే సాధ్యమని కొందరనుకుంటే, ఇంకొందరు జీవితంలో ఏది అందినా ఏది పొందినా భగవదాజ్ఞ తప్ప మరొకటి కాదనుకుంటూ భక్తిప్రపత్తుల్ని మరింతగా పెంచుకుంటారు. నిజంగా తన భక్త్భివంతో భగవంతుని పూజించేవాడు మనుగడలో మంచీ చెడులను సైతం వేరు చేసి చూడగలడు. చెడుని చెయ్యకపోవడమే కాదు చెడుని సహించకపోవడం సైతం మంచికి మానవత్వానికి శ్రీకారం చుట్టడమనుకుంటాడు. ఎవరో గొప్పగా చూడాలనో గొప్పగా చెప్పుకోవాలనో గాక మంచికి పట్టం కట్టేందుకు అన్ని వేళలా సంసిద్ధంగా వుంటాడు. నరునిగా తన బాధలు తనకు తప్పకున్నా వాటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తూనే చేతనైనంతలో ఎదుటివారి కష్టాలను కన్నీళ్లను దూరం చేయడంలో తన పాత్ర పోషిస్తాడు. ఆర్భాటాలకు, ప్రచారాలకు ఆమడ దూరంలో వుంటూ ఆపన్నులకు భగవంతుని ప్రతిరూపంగా కన్పిస్తాడు. జన హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకోగలుగుతాడు. దైనందిన జీవితానికి సంపాదన అవసరమే కాని సంపాదనొక్కటే జీవితాశయం కారాదు. మాటలో, వ్యవహారంలో, స్నేహంలో, బంధుత్వంలో విపరీత ధోరణులు కీడు చేసేవే తప్ప మేలు కలిగించేవి కాదు. అందుకే ఆచి తూచి వ్యవహరించగలగాలి.
భక్తుడి అవసరాలేమిటో కాక ఆలోచనలేమిటన్నదే భగవంతునికి ప్రధానం. భక్తుని కోరికలను తీరుస్తూ వరాలివ్వడమే భగవంతుని పని కాదు. ఏ కోరిక ఎవరికి ఎందుకు కలిగినా, అందుకు వారనుసరించే దారులేమైనా అది వారికి ఏ మేర అవసరమన్నది సర్వాంతర్యామికి కాక మరెవరికి తెలుస్తుంది. నిత్య జీవితంలో జరుగుతుందేమిటి? మానవ జన్మ ఎత్తడమే మహద్భాగ్యంగా భావించక ఒకరితో ఇంకొకరు పోటీపడుతూ సుఖం మాటెలా వున్నా అర్హతలకు తగిన అవకాశాల కోసం పరుగెత్తి పరుగెత్తి అలసిపోతున్నారు, ఆయాసానికి గురవుతున్నారు తప్ప అర్హతలకన్నా యోగ్యం ముఖ్యమని భావించలేకపోతున్నారు. ఫలితంగా దైవధ్యానంలో, దైవదర్శనంలో, ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించే పూజల్లో సైతం ఆనందాన్ని పొందలేకున్నారు. సువిశాలమైన లోకంలోని అందాలను, ఆనందాలను ఆస్వాదించలేకున్నారు. అర్హతలకన్నా యోగ్యత ప్రధానమనుకోనివారికి భక్తి, ముక్తి, జీవాత్మ, పరమాత్మ తత్వాలు బోధపడేదెలా? మనుగడలో కష్టాలు నష్టాలు అనివార్యమైనా ఒకవైపు వాటిని అధిగమిస్తూనే మరొకవైపు జరిగిన పొరపాట్లను పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. తన కోరికలపై ఎవరో నియంత్రణ చేస్తున్నట్లు తన అవసరాలపై మరెవరో ఆంక్షలు విధిస్తున్నట్లు భావించక తనకు మేలు చేయని విషయాలపై తానే నియంత్రణ చేసుకోవాలి. కోరికల పుట్టగా పేర్కొనబడే జీవితంలో అదుపాజ్ఞలు ఎదుగుదలకు ఊతమయ్యేవే తప్ప అడ్డుగోడలు కావు, కాబోవు. తన ఆలోచనలపై, తన ఆవేశాలపై ముఖ్యంగా తన కోరికలపై ఎవరు నియంత్రణ విధించుకొని అందుకు అనుగుణంగా నడుచుకోగలరో వారిలోనే మానవత్వం కనిపించే వీలవుతుంది. దైవత్వం పెంపొందించుకునే మార్గం సుగమమవుతుంది.

- కొల్లు రంగారావు