నెల్లూరు

చేజర్లకు ఇసుక రీచ్ కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేజర్ల, మార్చి 19: చేజర్ల మండలానికి ఒక ఇసుక రీచ్ కేటాయించాలని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై ఇప్పటికే ఒక పర్యాయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మరో మారు చర్చించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. శనివారం చేజర్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆయన జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డితో కలసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇసుక రీచ్ స్థానికంగా లేకపోవడంతో ఎదురవుతున్న ఇక్కట్లపై ఏకరవుపెట్టారు. మండల పరిధిలో పెన్నానదీ పరివాహకం కొనసాగుతున్నా రీచ్ కేటాయించకపోవడం దారుణమన్నారు. అంతేగాక ఇరుగుపొరుగున ఉన్న పొదలకూరు, కలువాయి మండలాలకు కూడా రీచ్ కేటాయింపు లేదన్నారు. దీంతో ఈ మూడు మండలాల ప్రజానీకం గృహ నిర్మాణాలకు సంబంధించి ఇసుక సేకరణ కోసం నానా అగచాట్లు పడుతున్నారన్నారు. అలాగే అభివృద్ధి పనులకు సంబంధించి కూడా అవస్థలు పడుతున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వ అనుమతి కలిగిన రీచ్‌ల నుంచి తీసుకురావాలంటే ఇసుక సేకరణకు భారీగా ఖర్చులవుతున్నాయని వాపోయారు. ఎక్కడైనా కొద్దోగొప్పో ఇసుక సేకరించినా పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్నందున తమ మండలంలో తప్పక రీచ్ కేటాయించాలన్నారు. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా చేజర్ల మండలంలోని అన్ని గ్రామాలకు కలిపి ఒకేఒక్క ఫీల్డు అసిస్టెంట్ మాత్రమే ఉండటం కూడా ఎంపి, జడ్పీ చైర్మన్ దృష్టికి వచ్చింది. సీనియర్ మేస్ర్తిల ద్వారానే ఉపాధి హామీ పనులను నెట్టుకొస్తున్నారనే సంగతిని ప్రజాప్రతినిధులు వివరించారు. ఇదిలాఉంటే వ్యవసాయానికి పగటి వేళల్లోనే విద్యుత్ సరఫరా చేయాలని కూడా ప్రజాప్రతినిధులు ఎంపి, జడ్పీ చైర్మన్‌ను కోరారు. సభలో తెలిపిన సమస్యలను సావదానంగా ఆలకించిన ఎంపి, జడ్పీ చైర్మన్‌లు తప్పక పరిష్కారానికి తమవంతుగా తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు.