నెల్లూరు

ప్రత్యేక హోదా కోసమే కాంగ్రెస్ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, మార్చి 19: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఉద్యమం ద్వారా దేశ రాజధానిలో ప్రభావితం చేసినట్లు డిసిసి అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య తెలిపారు. శనివారం నెల్లూరులోని ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి నాయకత్వంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే దృఢసంకల్పంతో 5 కోట్ల తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకు ప్రతీకంగా కాంగ్రెస్ పార్టీ సేకరించిన కోటి సంతకాలతో 300 మంది కాంగ్రెస్ నాయకులు ఎపి ఎక్స్‌ప్రెస్‌లో మార్చి 12వ తేదీన ఢిల్లీ వెళ్లినట్లు తెలిపారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, శరద్‌యాదవ్, సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌పవర్, సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆంధ్రప్రదేశ్ డిమాండ్లను బలపరిచి సంఘీభావం తెలిపారని చెప్పారు. అందులో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా సంతకాలు చేశారని అన్నారు. అంతేకాకుండా ప్రత్యేక హోదా ఉద్యమానికి అండగా నిలిచారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్‌ను కాంగ్రెస్ పార్టీ ఎంపిలు కోరినా ఇవ్వలేదన్నారు. ప్రధానమంత్రి ఎపి ప్రజల ఆకాంక్షలను వినడానికి సిద్ధంగా లేరని తెలుస్తోందన్నారు. 5 కోట్ల ప్రజల తరపున కోటి సంతకాలతో కలిసి విజ్ఞప్తి చేద్దామనుకున్నా వినే పరిస్థితుల్లో లేరన్నారు. ప్రత్యేక హోదా పిపి పునర్‌వ్యవస్థీకరణ చట్టం అమలుచేస్తే కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుందని బిజెపి కుట్ర చేస్తోందన్నారు. ఏ చట్టంలో ఉందని మోదీ బీహార్‌కు లక్ష 25వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చారో చెప్పాలన్నారు. ఏ చట్టంలో ఉందని కాశ్మీర్‌కు 75 వేల కోట్ల ప్యాకేజి ఇచ్చారో చెప్పాలన్నారు. అదేవిధంగా గుజరాత్ బుల్లెట్ ట్రైయిన్‌కు 60వేల కోట్లు ఎలా ఇచ్చారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టంలో ఉన్న జాతీయ ప్రాజెక్టు పోలవరానికి వందకోట్లు, చట్టంలో పెట్టిన రెవెన్యూ లోటు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్‌ను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో పార్లమెంటు లోపల, బయట కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంటే దాని దృష్టి మరల్చడానికి చేసిందే టిడిపి ప్రభుత్వ అసెంబ్లీ తీర్మానమన్నారు. రాష్ట్ర విభజన సందర్భంలోనూ చంద్రబాబు ఇదేవిధంగా చేశారన్నారు. మాజీ జడ్పీ చైర్మన్ చెంచలబాబు యాదవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బిజెపి ఘోరంగా మోసం చేసిందన్నారు. పార్లమెంట స్ఫూర్తినే దెబ్బతీసిందన్నారు. టిడిపి ఈ ద్రోహంలో భాగం పంచుకుంటోందన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి విద్యావంతులు, విద్యార్థులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, కవులు, రచయితలు, మేధావులు అంతా ఉద్యమంలోకి రావాలన్నారు. పిసిసి సమన్వయ కమిటీ చైర్మన్ సివి శేషారెడ్డి మాట్లాడుతూ వెంకయ్యనాయుడు మాటల గారడీతో పార్లమెంటును తప్పుదోవ పట్టించారని అన్నారు. ప్రస్తుతం మోదీ అధికారానికి భయపడి సమస్య నుండి పారిపోయారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పిసిసి ఉపాధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి, పిసిసి అధికార ప్రతినిధి కనకట్ల రఘురామ్ ముదిరాజ్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ బాలసుధాకర్, శివాచారి, కేశవ తదితరులు పాల్గొన్నారు.