నెల్లూరు

నన్ను కొడుతున్నా పట్టించుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, మార్చి 19: తనపై మద్యం వ్యాపారులు దాడికి పాల్పడుతుంటే కళ్లారా చూస్తున్న ఇద్దరు ఆత్మకూరు సబ్ ఇన్‌స్పెక్టర్లు ప్రేక్షకపాత్ర వహించారే తప్ప పట్టించుకున్న పాపాన పోలేదని స్థానిక పోలీస్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ ఆవేదన చెందుతున్నారు. తన పరిస్థితే ఇలాగైతే, ఇక సామాన్య ప్రజానీకంపై ఎవరైనా దాడులకు పాల్పడినా రక్షించాల్సిన పోలీస్‌శాఖ చేతులెత్తేయడమేనా అంటూ వాపోతున్నారు. మద్యం వ్యాపారుల నుంచి వసూలయ్యే నెలవారీ మామూళ్ల పర్వంతో ఆత్మకూరు ఖాకీల పరువు గంగ పాలవుతోన్న వైనమిది. పట్టణంలోని ఎల్‌ఆర్ పల్లెలో ఎదురెదురుగా ఏర్పాటైన రెండు బ్రాందీ షాపుల నడుమ ధరల విషయమై రేగిన పేచీ ఘర్షణకు తావివ్వడం తెలిసిందే. ఈ ఘర్షణ అదుపుచేసే నిమిత్తమై వెళ్లిన ఆత్మకూరు-1 ఎస్సై ఎం పూర్ణచంద్రరావు అభాసుపాలయ్యారు. ఆయన వెంట వెళ్లిన కానిస్టేబుల్ లక్ష్మీనారాయణను మద్యం వ్యాపారులు నెట్టిపారేశారు. ఈ సందర్భంలో అతని చొక్కా కూడా చిరిగిపోయింది. అయితే కానిస్టేబుల్‌పై దాడి జరుగుతుంటే పక్కనే ఉన్న ఎస్సై పూర్ణచంద్రుడు కొంత దూరం అవతలకు వెళ్లిపోవడం శాఖాపరంగానే విమర్శలకు తావిస్తోంది. ఘర్షణ పెద్దదవుతుందని తెలుసుకున్న ఆత్మకూరు-2 ఎస్సై అబ్దుల్ రజాక్ దుస్థితి కూడా అంతే. కానిస్టేబుల్‌పై దాడిని నిలువరించకపోయారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే.. సదరు మద్యం వ్యాపారులు బిగ్గరగా కేకలు వేస్తూ ‘నెలవారీ మామూళ్లు తీసుకోవడం లేదా’ అంటూ పత్రికల్లో రాయలేని పదజాలంతో దుర్భాషలాడారు. ఆ వ్యాపారుల ఆక్షేపణల పరంపరతో తరువాత నెల మామూళ్లు ఎక్కడ రాకుండా పోతాయోనని ఎస్సైలు మిన్నకున్నారనే ప్రచారం జరుగుతోంది. అదే సందర్భంలో నెట్టివేయబడి, చొక్కా చిరుగుతున్నా ఆ కానిస్టేబుల్ సంగతి పట్టించుకోలేదు. ఇలా ఘర్షణ పెద్దదవుతున్న సంగతి తెలుసుకుని అక్కడకు చేరుకున్న సిఐ ఖాజావలి ఒకింత సమయస్ఫూర్తితో వ్యవహరించారు. దాడికి పాల్పడిన నిందితుడ్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఏదేమైనా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పీ గున్నీ రేపో మాపో ఆత్మకూరు రానున్నారు. ఆయన రాకను పురస్కరించుకుని పోలీస్‌స్టేషన్‌కు రంగులు వేయించి తీర్చిదిద్దుతున్నారు. రంగులతో స్టేషన్‌ను తీర్చిదిద్దినా అంతర్గతంగా కలకలం రేపుతోన్న ఇలాంటి అంశాలపై ఇక్కడకు ప్రత్యక్షంగా వచ్చాక ఎస్పీ గున్నీ ఎలా స్పందిస్తారనేది శాఖాపరంగా చర్చనీయాంశమైంది.