నెల్లూరు

ఐఏబి సమావేశం వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 19: డెల్టా ప్రాంత రైతాంగానికి రెండవ పంట కోసం సాగునీటి విడుదలకు ఉద్దేశించి ఆదివారం నిర్వహించాల్సిన సాగునీటి సలహా మండలి సమావేశం వాయిదా పడింది. తిరిగి ఈనెల 23న సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. గత కొంతకాలంగా సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలని రైతు సంఘాల నుంచి తీవ్రస్థాయిలో వస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గిన ప్రభుత్వం ఆదివారం సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో సమావేశ నిర్ణయం త్వరగా జరిగి సాగు పనులు చేపట్టవచ్చని భావించిన డెల్టా రైతాంగానికి వెంటనే సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం ఆగ్రహాన్ని తెప్పించకమానదు. ఇప్పటికే సోమశిల జలాశయంలో ఉన్న నీటి నిల్వపై పలు ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలో సమావేశం వాయిదా పడడంపై రైతు సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.