నెల్లూరు

పద్య పోటీలు.. నాట్య ప్రదర్శనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ్యాంధ్ర పుస్తక సంబరాల్లో భాగంగా చిన్నారుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలకు ప్రత్యేక పోటీలు నిర్వహించడంతో పండుగ వాతావరణ నెలకొంది. ఎల్‌కేజి నుంచి 2వ తరగతిలోపు విద్యార్థులు రెండు నిమిషాల వ్యవధిలో పద్యాలు చెప్పేవిధంగా, 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మూడు నిమిషాల సమయంలో పద్యాలు స్పష్టంగా పలికేవిధంగా ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. మరికొందరు వేమన, సుమతి శతకాలను ఆలపించి అందరినీ అబ్బురపరిచారు.
నవ్యాంధ్ర పుస్తకాల సంబరాల్లో భాగంగా క్విజ్ పోటీల్లో 70 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 5 నుంచి 10వ తరగతి చదువుతున్న వారికి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు వేర్వేరుగా ఈ పోటీలు నిర్వహించారు. నలుగురు విద్యార్థుల చొప్పున విభజించి జనరల్ నాలెడ్జ్, సాంస్కృతికం, చరిత్ర, తదితర అంశాలపై ప్రశ్నలు వేస్తూ దానికి సంబంధించిన సమాధానాలను ఆ గ్రూపుల వారు చర్చించుకొని సమాధానం ఇచ్చే విధంగా పోటీలు నిర్వహించారు. పోటీల్లో ఆయా గ్రూప్‌లకు చెందిన విద్యార్థులు పోటాపోటీగా సమాధానాలు ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.
**

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net