నెల్లూరు

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జెసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లకూరు, ఏప్రిల్ 3: మండలంలోని చిల్లకూరు 24 సొసైటీ పరిధిలోని అక్కగారిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం జిల్లా జాయింట్ కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ అహ్మద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రైతుల నుంచి ఇప్పటి వరకు ఎంత ధాన్యాన్ని కొనుగోలు చేశారనే దానిపై ఆరా తీసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లో రైతులకు చెక్కులు ఇచ్చేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. దళారుల నుంచి రైతులను కాపాడేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులకు అవగాహన కల్పించి ధాన్యం కేంద్రం ద్వారా అమ్ముకొనే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రైతులు దళారుల వలలో పడకుండా జాగత్తపడాలన్నారు. ఆయన వెంట సొసైటీ అధ్యక్షులు కొట్టంరెడ్డి రామలింగరెడ్డి, సిఇవో శ్రీనివాసుల రెడ్డి, తహశీల్దార్ రోజ్‌మాండ్, ఆర్‌ఐ మురళి తదితరులు ఉన్నారు.

నేటి నుంచి శిరస్త్రాణం.. అవశ్యం
నెల్లూరు, ఏప్రిల్ 3: నేటి నుంచి జిల్లాలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌లు వాడటాన్ని తప్పనిసరి చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పత్రికలు, పలు సామాజిక అనుసంధాన వేదికల ద్వారా పోలీసులు వాహనదారుల్ని అప్రమత్తం చేశారు. ద్విచక్ర వాహనాలు నడిపే వారు హెల్మెట్ లేకుండా నడపడాన్ని తప్పుబట్టిన హైకోర్టు గతంలో పలు పర్యాయాలు ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొద్ది రోజుల పాటు సజావుగా సాగిన ఈ హెల్మెట్‌ల వాడకాన్ని తర్వాత పోలీసులు సైతం పెడచెవిన పెట్టేశారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో పోలీసులపై ఒత్తిడి తీసుకురాకపోవడంతో వారు మిన్నకుండిపోయారు. తిరిగి సోమవారం నుంచి ద్విచక్ర వాహనాలను నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ వాడాల్సి ఉంటుందని, లేకుంటే తగిన చర్యలు తప్పవని పోలీసులు గత కొన్ని రోజలుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జిల్లా ఎస్పీగా విశాల్ గున్ని బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నగరంలో ట్రాఫిక్ నిబంధనలను సరళీకరించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలోనూ ఎక్కువ ఫిర్యాదులు ట్రాఫిక్‌పైనే వస్తుండటంతో ఆయన ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఇకపై నగరంలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై పోలీసు చర్యలకు ఉపక్రమించనున్నారు. ఇందులో భాగంగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తూ చిక్కిన వారికి తొలి దఫా జరిమానా విధిస్తారు. రెండవ పర్యాయం కూడా దొరికితే అపరాధ రుసుంతో పాటు వాహనాన్ని సీజ్ చేయనున్నారు. మూడో దఫా తప్పు జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. గతంలో మాదిరి ఏదో తూతూమంత్రంలా కాకుండా ఈ సారైనా పోలీసులు హెల్మెట్ నిబంధనలపై కఠినంగా వ్యవహరించి, బైకర్ల దూకుడుకు కళ్లెం వేయాలని నగర వాసులు కోరుతున్నారు.