బిజినెస్

బిఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టిఎన్‌ఎల్‌కు టెలికాం శాఖ నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తపాలా శాఖకూ జారీ * సేవలపై అసంతృప్తే కారణం
న్యూఢిల్లీ, నవంబర్ 22: ప్రభుత్వరంగ టెలికాం సంస్థలైన బిఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టిఎన్‌ఎల్‌కు టెలికాం మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. వీటితోపాటు తపాలా శాఖకూ నోటీసులిచ్చింది. ఈ ఏడాది జూలై నుంచి సోషల్ మీడియాలో వీటి పనితీరుపట్ల వినియోగదారులు వ్యక్తం చేసిన అసంతృప్తి నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఫేస్‌బుక్‌కు 4.65 లక్షల మంది ఫాలోయర్లుండగా, వీరిలో అత్యధిక శాతం మంది తన మంత్రిత్వ శాఖ పరిధిలోని బిఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టిఎన్‌ఎల్, ఇండియా పోస్ట్స్ పనితీరుపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే ఈ నోటీసులు జారీ అయ్యాయి. కాగా, సోషల్ మీడియాను వినియోగించాలని బిఎస్‌ఎన్‌ఎల్‌తోపాటు ఇతర శాఖలను మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోరారు.