నిజామాబాద్

ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు రాద్ధాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, జనవరి 9: తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుడితే, వీటిపై ప్రతిపక్షాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయని ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్.్భపతిరెడ్డి ఆరోపించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. సోమవారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులు నిర్మించేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం తీసుకరావడం జరిగిందని, ఇందులో లోపాలు ఉండటంతో కొన్ని సవరణలు చేసి 2016 కొత్త చట్టాన్ని తీసుకరావడం జరిగిందని, దానినే అసెంబ్లీలో ఆమోదించడం జరిగిందన్నారు. ఏ ప్రభుత్వమైనా ప్రాజెక్టులు కట్టాలంటే వేల ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందన్నారు. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం కృష్ణ, గోదావరి పరివాహక ప్రాజెక్టులను రీ-డిజైన్ చేసిందన్నారు. అందులో భాగంగానే మల్లన్నసాగర్ లాంటి ప్రాజెక్టును చేపట్టి, పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం 123 జీవోను తీసుకవచ్చిందన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు 123 జీవోను కొట్టివేయాలని కోరుతూ కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు హైకోర్టుకు వెళ్లడం జరిగిందని అన్నారు. దీంతో హైకోర్టు 123జీవోను కొట్టివేయగా, 2013్భసేకరణ చట్టానికి సవరణలు చేసి కొత్త చట్టం(2016)ను తీసుకరావడం జరిగిందన్నారు. రైతులకు ప్రయోజనం చేకూర్చే ఈ చట్టంపై కాంగ్రెస్, టిడిపిలు అనవసరపు రాద్ధాంతం చేయడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి రాష్ట్రానికి నిధులు ఇస్తుంటే, వాటిని సైతం ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ వైఖరిని మార్చుకుని, అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన సూచించారు. లేదంటే ప్రజల సరైన సమయంలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో టిఆర్‌ఎస్ నాయకులు ఎఎస్.పోశెట్టి, పృధ్వీరాజ్, విఠల్‌రావు, ఎంపిపి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

రెండవ విడత నీటి విడుదల
నిజాంసాగర్, జనవరి 9: నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులు యాసంగిలోపంటలు వేసుకునేందుకు, రెండవ విడతగా, నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం 1200 క్యూసెక్‌ల నీటిని విడుదల చేశారు. సోమవారం నిజాంసాగర్ ప్రాజెక్ట్ ద్వారా 1700 క్యూసెక్‌ల నీటిని విడుదల చేయడం జరిగిందని, ప్రాజెక్ట్ డిఇఇ దత్తాత్రి తెలిపారు. నిజామాబాద్ , కామారెడ్డి జిల్లాలలోని లక్షా 15వేల ఎకరాలకు పంటలను పండించడం కోసం సాగునీటిని విడుదల చేస్తున్నామని డిఈఈ తెలిపారు. రైతులందరు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాల్సిందిగా కోరారు. కాగానిజాంసాగర్ ప్రాజెక్ట్ హెడ్‌స్లూస్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన పెరిగింది. ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు అనుసంధానంగా ఉన్న జలవిద్యుత్ కేంద్రం గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడంతో1, 2 వ టర్బైన్‌ల ద్వారా 6.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన జరుగుతోందని, జెన్‌కోఏడిఈ శ్రీకాంత్ తెలిపారు.