నిజామాబాద్

నగర శివార్లలో యథేచ్ఛగా కబ్జాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 15: నిజామాబాద్ నగర శివార్లలో యథేచ్ఛగా కబ్జాల పర్వం కొనసాగుతున్నా, అధికారులు తమకేమీ పట్టనట్టుగా చోద్యం చూస్తున్నారు. నిరుపేదలు ఎక్కడైనా జానెడు జాగాను ఆక్రమించుకుంటే ఎనలేని హడావుడి చేస్తూ పోలీసుల పహారా మధ్య కబ్జాలను తొలగించే అధికారులు, బడాబాబుల భూకబ్జాల భాగోతం వైపు మాత్రం కనె్నత్తి చూసేందుకు కూడా సాహసించడం లేదు. నగర శివార్లలో ఏకంగా చెరువులను, వాటి శిఖం భూములను కబ్జా చేసినా, నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. తమకు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ కబ్జాదారులు చెలరేగిపోతున్నారు. కంటికి ఇంపుగా కనిపించే ఖాళీ జాగాలను తమ కబందహస్తాల్లోకి చేర్చుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ దందాలో పాతుకుపోయిన చోటామోటా నాయకులు తెర వెనుక ఉంటూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలోనైతే కబ్జాలకు అడ్డూఅదుపూ లేకుండాపోతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ నగరానికి ఆనుకుని అత్యంత సమీపంలో గల సారంగపూర్‌లోని రామర్తి చెరువు స్థలాన్ని కొందరు బడాబాబులు ఇదే తరహాలో కబ్జా చేశారు. ఈ కబ్జాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నప్పటికీ, అధికారులు వాటి గురించి పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రిగా, పిసిసి చీఫ్‌గా ప్రాతినిథ్యం వహించి, ప్రస్తుతం తెరాస తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న డి.శ్రీనివాస్ రామర్తి చెరువు పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ఈ చెరువు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అప్పట్లోనే చర్యలు చేపట్టారు. సుందరమైన పార్క్‌తో పాటు మార్నింగ్ వాక్‌కు అనువుగా ఆహ్లాదకరంగా రూపొందించేలా ప్రణాళికలు తయారు చేయించారు. దివంతగ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా రామర్తి చెరువును టూరిజం స్పాట్‌గా మల్చేందుకు తొలివిడత కొంతమేర నిధులను మంజూరు చేయించి వైఎస్‌చే శంకుస్థాపన జరిపించారు. అయితే ఈ చెరువు ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు సరిపడా పూర్తిస్థాయిలో నిధులు మంజూరు కాకపోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీనిని ఆసరాగా చేసుకున్న కబ్జాదారులు ఆ స్థలంపై కనే్నసి ఏకంగా శిలాఫలకాన్ని తొలగించారు. చెరువుకు సంబంధించిన శిఖం భూమినే కాకుండా, ఇదివరకు నీరు నిలువ ఉండే ప్రాంతాన్ని కూడా జెసిబిలు, ఇతర యంత్రాలతో చదును చేసి కబ్జాకు పాల్పడ్డారు. ప్రస్తుతం సారంగపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చే ఈ చెరువు స్థలమంతా కబ్జాదారుల చేతుల్లోకి చేరిపోయింది. అదేవిధంగా సారంగపూర్‌లోని శిఖం భూములు, ప్రభుత్వ స్థలాలు కూడా క్రమంగా కబ్జాలకు గురవుతున్నాయి. ఈ తతంగమంతా గత కొన్ని నెలల నుండి బాహాటంగానే కొనసాగుతున్నప్పటికీ, అధికారులు అటువైపు కనీసం కనె్నత్తి కూడా చూడడం లేదు. గతంలో ఇక్కడ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన ప్రద్యుమ్న ప్రభుత్వ మిగులు భూములను పరిరక్షించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రభుత్వ భూములను సర్వే ద్వారా గుర్తిస్తూ అవి అన్యాక్రాంతం కాకుండా వాటి చుట్టూ ఫెన్సింగ్‌లను ఏర్పాటు చేసి, వివరాలను సిసిఎల్‌లో పొందుపర్చారు. ఆ సమయంలో కబ్జాలకు అంతగా ఆస్కారం లేకుండాపోయింది. ప్రస్తుతం జిల్లా అధికారులు ప్రభుత్వ జాగాల గురించి అంతగా దృష్టిసారించకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, ఏకంగా ఫెన్సింగ్‌లు, శిలాఫలకాలను సైతం ధ్వంసం చేస్తూ దర్జాగా సర్కారీ భూములను కబ్జా చేసుకుంటున్నారు. ఈ కబ్జాలను గమనించి స్థానికులు ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేస్తే, కబ్జాదారులకు నోటీసులు జారీ చేయడంతోనే సరిపెట్టుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నివేశన స్థలాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన స్థలాలు నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ ఎక్కడ కూడా అందుబాటులో లేవంటూ అధికారులు ప్రభుత్వానికి ఇదివరకే నివేదికలు అందించగా, కబ్జాదారులు మాత్రం డేగ కళ్లతో ప్రభుత్వ ఖాళీ స్థలాలను అనే్వషిస్తూ వాటిని దర్జాగా కబ్జా చేసుకుంటున్నారు. గంగాస్థాన్, ముబారక్‌నగర్, బోర్గాం(పి) వంతెన పక్కన, సత్యనారాయణ స్వామి మందిరం పరిసరాల్లో పెద్దఎత్తున ప్రభుత్వ స్థలాలు ఇప్పటికే కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. అధికారుల అలసత్వం వల్లే నగర శివార్లలో యథేచ్ఛగా కబ్జాల పర్వం కొనసాగుతోందని స్థానికులు పెదవి విరుస్తున్నారు.

ఆక్రమణలను తొలగిస్తున్న పోలీసులపై దాడికి యత్నం
ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

బిచ్కుంద, జనవరి 15: బిచ్కుంద మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో వెలసిన ఆక్రమణలను ఆదివారం సాయంత్రం తొలగిస్తుండగా, సిఐ, కానిస్టేబుళ్లపై పలువురు దాడికి యత్నించారు. ఈ సందర్భంగా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఎంతోకాలం నుండి స్థానిక బస్టాండ్ ప్రాంతం చుట్టూ వివిధ దుకాణాలు వెలిశాయి. ప్రధానంగా టీ స్టాళ్లు, పాన్‌షాపులు, కోకాలు వెలిశాయి. పలువురు రోడ్డును సైతం ఆక్రమించుకుని తాత్కాలికంగా రేకుల షెడ్లు వేసుకుని వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. దీంతో అధికారులు పలుమార్లు ఆక్రమణలను తొలగించుకోవాలని తాఖీదు చేశారు. అయినప్పటికీ వినిపించుకోకపోవడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారం రోజుల క్రితం దుకాణదారులకు ఆక్రమణలు ఖాళీ చేయాలంటూ వౌఖికంగా ఆదేశాలిస్తూ, ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఇచ్చారు. కొంతమంది దుకాణాలను తొలగించుకోగా, మరికొందరు యథాతథంగా ఉంచారు. దీంతో ఆదివారం సాయంత్రం సిఐ సర్దార్‌సింగ్ నేతృత్వంలో పోలీసులు బస్టాండ్ ప్రాంతానికి చేరుకుని పొక్లెయిన్ సహాయంతో ఆక్రమణలను తొలగించేందుకు ఉపక్రమించారు. ఈ చర్యను జీర్ణించుకోలేకపోయిన పలువురు వాగ్వాదానికి దిగుతూ సిఐ సహా పోలీసు సిబ్బందిపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం పొక్లెయిన్ సహాయంతో బస్టాండ్ పరిసరాల్లో రోడ్లపై ఉన్న షెడ్లు, టీ స్టాళ్లు, కోకాలను తొలగించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ వ్యక్తి తండ్రి తీవ్ర ఆందోళనకు గురై రక్తపోటు విపరీతంగా పెరగడంతో స్థానికులు అతనిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.