నిజామాబాద్

ఉపాధ్యాయుల ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, ఏప్రిల్ 7: సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి జిపిఎఫ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టిఎస్‌యుటిఎఫ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఆర్మూర్ పట్టణంలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని తహశీల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీరోడ్, అంబేద్కర్ చౌరస్తాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా టిఎస్‌యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.సురేష్, డి.సత్యానంద్‌లు మాట్లాడుతూ 1991 నుంచి సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు సేవారంగాల ప్రయివేటీకరణ, సంక్షేమ రంగాల్లో కోతలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఈ క్రమంలోనే 2003 డిసెంబర్ 22న వాజ్‌పేయ్ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం పెన్షన్ ప్రయివేటీకరణకు శ్రీకారం చుట్టిందని అన్నారు. పిఎఫ్‌ఆర్‌డిఎ బిల్లును రూపొందించిందని అన్నారు. ఒకసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జీవితాంతం పెన్షన్, వారి మరణాంతరం కుటుంబ సభ్యులకు పెన్షన్ అందిస్తున్నట్లుగా 30 సంవత్సరాలు సర్వీసు చేసే ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కూడా ప్రభుత్వ పెన్షన్ విధానాన్ని అమలు చేసి వారి జీవితాలకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్, కార్యదర్శులు మల్లేష్, సాయన్న, ఆనంద్, గంగాప్రసాద్, సురేష్, చందు, బాబు, ఆర్మూర్ డివిజన్‌లోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.