నిజామాబాద్

భారత దేశ సంస్కృతి గొప్పది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, ఏప్రిల్ 12: భారత దేశ సంస్కృతి సంప్రదాయాలు ఎంతోగొప్పవని, వాటిని ఆచరించడం వల్ల అంతా మంచే జరుగుతోందని హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామిజి అన్నారు. మంగళవారం రాత్రి పట్టణంలోని ఎన్‌జిఒస్ కాలనీలోని ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమానికి ముఖ్య అతిథిగాహాజరైయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, భాను నమస్కర ప్రియ,శివ జలప్రియ, విష్ణు అలంకార, దేవి అర్చన తదితర విషయాలపై భక్తులకు వివరించారు. కుంకుమ పూజలోపాల్గోని భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బాలయ్య, ప్రతినిధులు గౌరి శెట్టి శ్రీను, లక్ష్మిపతి, చంద్రశేఖర్, స్వర్ణలత, భానుప్రియ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.