నిజామాబాద్

తాగునీటి సమస్యపై నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీపేట, ఏప్రిల్ 12: నవీపేట మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ 9వ వార్డు మెంబర్ నవీన్‌రాజ్ మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం గది ముందు కింద పడుకుని నిరసన తెలిపారు. ఈ విషయాన్ని ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇకి ఫోన్‌లో వివరిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, మండల అధికారులు స్పందించి సుభాష్‌నగర్‌లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని నవీన్‌రాజ్ కోరారు. ఇందుకు స్పందించిన ఎంపిడిఓ సాజీద్‌అలీ, ఎంపిపి రాజేందర్‌గౌడ్‌లు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నవీన్‌రాజ్ అక్కడి నుండి వెనుదిరిగాడు.