నిజామాబాద్

ఖరీఫ్‌కు ముందే ఇన్‌పుట్ సబ్సిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 12: పరిస్థితులు అనుకూలించక పంటలు నష్టపోయిన రైతాంగానికి ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఇన్‌పుట్ సబ్సిడీని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఇన్‌పుట్ సబ్సిడీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని అన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం మంత్రి పోచారం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కరవు తీవ్రత వల్ల పంటలకు పెద్దఎత్తున నష్టం వాటిల్లిందని, అయితే కేంద్ర ప్రభుత్వం 700కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించి కేవలం 56కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేసిందని చెప్పారు. ఫలితంగా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని అందించడంలో కొంత జాప్యం జరిగిందన్నారు. కేంద్రం నుండి నిధులు రావడంలో ఆలస్యమైనా, రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ నిధులను ముందుగానే విడుదల చేస్తుందన్నారు. ప్రస్తుత కరవు పరిస్థితుల్లో రైతులను అన్ని విధాలుగా ఆదుకునేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పశువుల మేత సాగుకై 75శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తున్నామని, నీటి వసతి కలిగిన రైతులకు మంజూరీలు ఇస్తున్నామని తెలిపారు. మన వ్యవసాయం - మన తెలంగాణ పేరుతో ఏ సీజన్‌లో ఏ రకం పంటలు సాగు చేయాలనే వివరాలతో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పశువుల తాగునీటి కోసం 2వేల నీటి తొట్టెల నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. లక్ష రూపాయల్లోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి పోచారం భరోసా కల్పించారు. 2015-16 సంవత్సరానికి పాలు విక్రయించుకునే రైతులకు లీటరుకు 4రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని, ఇందుకు మరో 59కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. స్ర్తి నిధి కింద గేదెలు కొనుగోలు చేసేందుకు 50వేల రూపాయలు మంజూరు చేస్తున్నామని, వర్షాకాలం సీజన్ ప్రారంభమయ్యే నాటికి యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కాగా, జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అత్యల్ప వర్షపాతం నిజామాబాద్ జిల్లాలో నమోదైనప్పటికీ, నీటి ఎద్దడిని అధిగమించేందుకు ఎప్పటికప్పుడు శరవేగంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తుండడంతో తాగునీటి సమస్య అదుపులోనే ఉందని అన్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణలోకి తీసుకుంటూ జిల్లా యంత్రాంగం అహరహం శ్రమిస్తోందని మంత్రి పోచారం ప్రశంసించారు. నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చే అవకాశాలున్నాయని జిల్లా యంత్రాంగం ముందుగానే అంచనాకు వచ్చి తాగునీటి పనుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం సిఆర్‌ఎఫ్, నాన్ సిఆర్‌ఎఫ్ కింద 33కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందన్నారు. తాగునీటి కొరత నెలకొన్న ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంతో చాలావరకు నీటి సమస్యను నివారించగలిగామని తెలిపారు. భూగర్భజలాలు అడుగంటడంతో 285వ్యవసాయ బోరుబావులను అద్దెకు తీసుకుని ప్రజలకు నీటిని అందిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా 1155బోరుబావులను ఫ్లషింగ్, డీపెనింగ్ చేయించడంతో 704బోర్లలో నీరు పడిందన్నారు. వాస్తవానికి గతేడాది 55గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం జరిగిందని, ఈసారి కరవు తీవ్రత నేపథ్యంలో మరింత గడ్డు పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టిన ఫలితంగా కేవలం 8గ్రామాల్లో మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1645గ్రామాల్లో ఎక్కడ తాగునీటి సమస్య ఉత్పన్నమైనా వెంటనే ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాంగంతో సమన్వయం పెంపొందించుకుని సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపుతున్నారని అన్నారు. విలేఖరుల సమావేశంలో జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు, కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, జె.సి రవీందర్‌రెడ్డి తదితరులున్నారు.