నిజామాబాద్

ప్రజాస్వామ్యం అపహాస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఏప్రిల్ 14: దేశంలో దళితులపై కేంద్రంలోని బిజెసి సర్కార్ దాడులకు ఉసిగొల్పుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ ఆరోపించారు. గురువారం నగరంలోని బస్వాగార్డెన్‌లో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయన, స్థానిక విలేఖరులతో మాట్లాడారు. దేశంలో ఒకవైపు దళితులపై దాడులు కొనసాగిస్తునే, మరోవైపు కేంద్రంలోని బిజెపి సర్కార్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుండటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. నాగ్‌పూర్‌లో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించడం జరుగుతుందని, అందువల్ల ఆ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన జెఎన్‌యు నేత కన్హయ్యపై భజరంగ్‌దళ్ నేతలు చెప్పులతో దాడి చేయడం జరిగిందని, ఇది డాక్టర్ బిఆర్.అంబేద్కర్‌ను అవమానించడమేనని అన్నారు. అనునిత్యం ఇలాంటి దాడులకు పాల్పడుతున్న భజరంగ్‌దల్, ఆర్‌ఎస్‌ఎస్ దేశంలో ఏదైనా చెప్పుల దుకాణం పెట్టిందా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. చెప్పులతో కొట్టిన వాడు త్వరగా నాశనం అవుతారని, కొట్టించుకున్న వాడు అంతే త్వరగా ఉన్నత స్థాయికి చేరుకుంటారని హిందూ ధర్మంలో రాసి ఉందని ఆయన గుర్తు చేశారు. జెఎన్‌యు నేత కన్హయ్యను చూసి బిజెపి సర్కార్ ఎందుకు బయపడుతోందని అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నోరు విప్పితే అబద్దాలే చెబుతారని ఆయన ఎద్దేవా చేశారు. భారత్, అమెరికా కలిసి ఆయుధాలు, విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నాయని అన్నారు. అమెరికా ఇప్పటికే అనేక దేశాలపై దాడులకు పూనుకోవడం జరిగిందని, భారత్ అగ్రరాజ్యం మాట వినకపోతే మన దేశంపై కూడా దాడులకు అమెరికా వెనుకాదనని ఆయన పేర్కొన్నారు. అందువల్ల అమెరికాతో చేసుకున్న రక్షణ ఒప్పందాన్ని భారత్ వెంటనే రద్దు చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, మన దేశంలో బిజెపి సర్కార్ మత మార్పిళ్లకు, మైనార్టీలపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. హెచ్‌సియులో రోహిత్ ఆత్మహత్య, జెఎన్‌యులో కన్హయ్యపై దాడి అప్రజాస్వామికమన్నారు. కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్‌లో 125అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతారట, దళితులకు మాత్రం చేసిందేమీ లేదన్నారు. అసలు రాజ్యాంగం మీద కెసిఆర్‌కు విశ్వాసం ఉందా అని ప్రశ్నించారు. అధికార పార్టీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. వీరి వెంట సిపిఐ నాయకులు అజీజ్‌పాషా, పాశ పద్మ, కంజర భూమయ్య, సుధాకర్ తదితరులు ఉన్నారు.