నిజామాబాద్

స్థాయి మరిచి మాట్లాడుతున్న గంగారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, డిసెంబర్ 12: జిల్లాలో దళితులపై అనేక దాడులు జరుగున్నా ఏనాడు స్పందించని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములుపై అవాకు, చెవాకులు పేలడం శోచనీయమని దళిత, ప్రజా సంఘాల, రాజకీయ పార్టీల జేఏసీ కన్వీనర్ సావెల్ గంగాధర్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నం గ్రామానికి చెందిన రాజేశ్వర్, లక్ష్మణ్‌లు, భరత్‌రెడ్డి అక్రమ మొరం దందాను ప్రశ్నించినందుకు దళిత యువకులను మురికి గుంతలో ముంచి, నానా దుర్భాషలాడుతూ ముక్కు నేలరాయించిన విషయం గంగారెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. భరత్‌రెడ్డి దళిత యువకులపై చేసిన దాష్టీకం సోషల్ మీడియా ద్వారా బయటకు పొక్కడంతో, ఇద్దరు దళిత యువకులు కిడ్నాప్ చేసి నానా చిత్రహింసలకు గురి చేసిన విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. ఈ సంఘటనను నిరసిస్తూ దళిత, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు గడిచిన నెల రోజులుగా భరత్‌రెడ్డిని అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని ఉద్యమించడం జరిగిందన్నారు. భరత్‌రెడ్డి పోలీసులకు చిక్కకుండా ఉంచడంలో ఎంపీ కవితే స్క్రీన్‌ప్లే, కథ, దర్శకత్వం వహించారని ఆయన ఆరోపించారు. ప్రజా ఉద్యమాలు, ప్రతిఘటనల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కే.రాములు, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి, ప్రజల నుండి తెలుసుకున్న అభిప్రాయాలను ప్రగతి భవన్‌లో అధికారులు సమావేశమై చేపట్టాల్సిన చర్యలను వివరించడం జరిగిందన్నారు. అయితే టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, భరత్‌రెడ్డి జరిపిన హేయమైన చర్యను గానీ, జిల్లాలో అక్కడక్కడా జరిగిన దాడులను కానీ ఏనాడు కూడా ఖండించిన పాపానపోలేదన్నారు. పైగా ఈగ గంగారెడ్డి ఇంగితజ్ఞానం లేకుండా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడైన రాములుపై నోరు పారేసుకోవడం శోచనీయమన్నారు. శాంతిభద్రతల సమస్యను రాష్ట్ర ప్రభుత్వమే పరిష్కరించాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఈగ గంగారెడ్డికి లేకపోవడం విచారకమన్నారు. భరత్‌రెడ్డి ఏ పార్టీకి చెందిన నాయకుడని ప్రశ్నించిన ఈగ గంగారెడ్డి, ఒక చర్చను లేవదీశారని, కానీ, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు భరత్‌రెడ్డిని కేవలం ఒక గుండాగా, వీధి రౌడీగా, ఒక సంఘ విద్రోహశక్తిగా మాత్రమే చూడటం జరిగిందన్నారు. దళితుల పట్ల భరత్‌రెడ్డి అమానుష చర్యను నెల రోజుల్లో ఏనాడు ప్రశ్నించని గంగారెడ్డి, బాధితులకు న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని కోరినట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. దళితులపై జరుగుతున్న అన్యాయాలు, దాడులపై అహరహం ఉద్యమిస్తున్న జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములుపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం ఈగ గంగారెడ్డికి తగదని, గంగారెడ్డి తన స్థాయి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని వారు హితవు పలికారు. విలేఖరుల సమావేశంలో సీపీఐ నాయకుడు కంజర భూమయ్య, న్యూడెమోక్రసీ నాయకుడు వి.ప్రభాకర్, పోల సుధాకర్, భోజన్న, ఎడ్ల రాము, కోటేశ్వర్, వినోద్‌కుమార్, రాజన్న పాల్గొన్నారు.