నిజామాబాద్

నిజామాబాద్ కలెక్టర్‌గా ఎంఆర్‌ఎం రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 2: నిజామాబాద్ కలెక్టర్‌గా ఎంఆర్‌ఎం.రావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అదేవిధంగా బోధన్ సబ్ కలెక్టర్ సిక్తాపట్నాయక్‌కు స్థానచలనం కల్పిస్తూ, ఆమె స్థానంలో 2015 ఐఏఎ స్ బ్యాచ్‌కు చెందిన అనురాగ్ జయంతికి బాధ్యతలు అప్పగించారు. మంగళవారం రాత్రి భారీగా ఐఏఎస్ అధికారులకు బదిలీ కల్పించిన నేపథ్యంలో ఎంఆర్‌ఎం.రావును నిజామాబాద్ జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా కొనసాగుతున్నారు. నాలుగున్నర మాసాల నుంచి నిజామాబాద్ కలెక్టర్ పోస్టు ఖాళీగా ఉండడంతో ఆయనను తాజా గా ఈ జిల్లాకు బదిలీ చేశారు. ఇదివరకు ఇక్కడ కలెక్టర్‌గా కొనసాగిన డాక్టర్ యోగితారాణా గతేడాది ఆగస్టు రెండవ వారంలో హైదరాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు.
అప్పటి నుంచి నిజామాబాద్ జిల్లాకు రెగ్యులర్ కలెక్టర్‌ను నియమించలేదు. జాయింట్ కలెక్టర్ ఏ.రవీందర్‌రెడ్డిని పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇన్‌చార్జి కలెక్టర్‌గా కొనసాగించారు. రవీందర్‌రెడ్డి పదవీ విరమణ గడువు ముగిసినప్పటికీ, ప్రభుత్వం రెండేళ్ల పాటు సర్వీసును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే కలెక్టర్ యోగితారాణా బదిలీ కావడం, ఆమె స్థానంలో ఇన్‌చార్జి కలెక్టర్‌గా దాదాపు నాలుగున్నర మాసాల పాటు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో విధులు నిర్వర్తిం అవకాశం లభించింది.
ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా ఐఏఎస్ అధికారులకు భారీగా స్థానచలనాలు కల్పిస్తూ, నిజామాబాద్‌కు రెగ్యులర్ కలెక్టర్‌గా ఎంఆర్‌ఎం. రావును నియమించింది. 2007 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన రావు త్వరలోనే ఇక్కడికి చేరుకుని బాధ్యతలు స్వీకరించనున్నారు. సుదీర్ఘ విరామం తరువాత రెగ్యులర్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పనితీరు మరింత వేగం పుంజుకుంటుందని ఆశిస్తున్నారు. ఇదిలాఉండగా, బోధన్ సబ్ కలెక్టర్‌గా పని చేస్తున్న సిక్తాపట్నాయక్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్‌గా నియమిస్తూ స్థానచలనం కల్పించారు. సుమారు ఏడాది కాలానికి పైగా ఆమె సబ్ కలెక్టర్‌గా కొనసాగుతూ, బోధన్ డివిజన్ పరిధిలోని పాలనా వ్యవహారాలపై తనదైన ముద్ర వేశారు. ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించి సమర్ధవంతమైన అధికారిణిగా గుర్తింపు పొందారు.
తాజాగా ఆమె స్థానంలో 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అనురాగ్ జయంతిని బోధన్ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు.
ఘనంగా పౌర్ణమి వేడుకలు
ఆర్మూర్, జనవరి 2: ఆర్మూర్ పట్టణంలోని సాయిబాబా, లక్ష్మీనర్సింహా స్వామి ఆలయం, సిద్ధులగుట్టపై పౌర్ణ మి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాయిబాబా ఆలయంలో హారతి, పల్లకి సేవ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నదాత చుక్కల నర్సయ్య, ఆలయ ప్రతినిధులు చిట్ల యగ్నేష్, ఎస్‌ఎన్ చారి, పాల గంగాధర్, బాలకిషన్, డాక్టర్ అనిల్ పడాల్, కంఠం గంగాధర్, గెంట్యాల గణేష్‌లు పాల్గొన్నారు. అలాగే గోల్‌బంగ్లా సమీపంలో గల లక్ష్మీనర్సింహా స్వామి ఆలయంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు పూజ నరేందర్, ఆకుల శ్రీనివాస్, లింగన్న, బొట్ల విజయ్, కోలు చంద్రశేఖర్, దొం డి ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.