నిజామాబాద్

ప్రపంచంలోనే భారత ఎన్నికల విధానం గొప్పది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జనవరి 21: భారతదేశ ఎన్నికల విధానం ప్రపంచలోనే చాల గొప్ప విధానం అని జిల్లా కలెక్టర్ ఎన్.సత్యనారాయణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఓటర్‌ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, సెగ్మెంట్‌లలోని విద్యార్థులకు ఓటు హక్కు, ఎన్నికల సంస్కరణలు తదితర అంశాలపై వక్తృత్వ, వ్యాసరచన పోటీల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు తమకు రాజ్యంగం కల్పించిన ఓటు హక్కును సధ్వినియోగం చేసుకోవాలని అన్నారు. మంచి ప్రజాస్వామ్యం కావాలంటే ప్రతిఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోని ప్రజాస్వామ్య పరిరక్షణ చేయాలని అన్నారు. 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు విధిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అన్నారు. దీనికి భారత ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసిందన్నారు. ఆన్‌లైన్ విధానం ద్వారా బూత్ లేవల్ కార్యాలయం, ద్వారా ఫారం నంబర్ 6ద్వారా తమ ఓటు హక్కును పొందవచ్చని అన్నారు. విద్యార్థిని విద్యార్థులు ఓటు హక్కుపై స్పష్టమైన అవగాహన కల్గి ఉండాలని అన్నారు. నాణ్యమైన ఓటింగ్ విధానానికి తమవంతు తోడ్పాటును అందించాలని అన్నారు. తమ చుట్టుపక్కల నిరాక్షరాస్యులు, అవగాహన లేని వారికి ఓటు హక్కు గొప్పతనం తద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణపై చైతన్య తేవాలని అన్నారు. కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి సెగ్మెంట్‌ల పరిధిలో సీనియర్, జూనియర్ విద్యార్థినీ విద్యార్థులకు 18మంది విద్యార్థుల చొప్పున ఓటు బాధ్యత, భారత ప్రజాస్వామ్యం, యువత ప్రాధాన్యత, ఓటు నమోదు ప్రక్రియ, నియామవళి, ఎన్నికల సంస్కరణలు తదితర అంశాలపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. సీనియర్ జూనియర్‌లలో ఇద్దరు చొప్పున గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతోందని అన్నారు. గెలుపొందిన వారికి ఈనెల 25న ఓటర్‌డే సందర్భంగా వారికి సన్నానం, వారికి ఎపిక్ కార్డులు అందచేయడం జరుగుతోందని అన్నారు. సమావేశంలో కామారెడ్డి ఆర్డీవో శ్రీను, తహశీల్దార్ రవీందర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ షేక్‌సలామ్, అధ్యాపక బృందం, జిల్లా ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.