నిజామాబాద్

వాణిజ్య పంటలకు మద్దతు ధర కల్పించాలని కేంద్రాన్ని కోరాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 22: పసుపు, మిర్చి వంటి వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధర కల్పించాల్సిందిగా కేంద్రాన్ని కోరామని, ఈమేరకు ముఖ్యమంత్రి ఇప్పటికే లేఖలు రాశారని, తాను కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భాల్లో పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. వాణిజ్య పంటలకు కేంద్రం మద్దతు ధర కల్పించకపోవడంతో దళారులే తమకు ఇష్టం వచ్చిన రీతిలో ధరలను నిర్ణయిస్తూ రైతులను నష్టపోయేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోటగిరి మండలం పోతంగల్ గ్రామంలోని సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంది కొనుగోలు కేంద్రాన్ని శనివారం మంత్రి పోచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, పసుపు, మిర్చి తదితర వాణిజ్య పంటలు సాగు చేసే రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వేల్పూర్ మండలంలోని పడిగెల వద్ద స్పైస్ పార్కును ఏర్పాటు చేస్తోందని చెప్పారు. దీనిని నెలకొల్పేందుకు మొదట కేంద్ర వాణిజ్య శాఖ అంగీకారం తెలిపిందని, 46ఎకరాల స్థలాన్ని సేకరించి ఉద్యానవన శాఖకు రిజిస్ట్రేషన్ కూడా చేశామన్నారు. తీరా కేంద్ర ప్రభుత్వం స్పైస్ పార్కును రాష్టమ్రే నిర్మించుకోవాలంటూ చేతులెత్తేసిందన్నారు. రైతాంగ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమాత్రం వెనుకంజ వేయకుండా స్పైస్ పార్కు నిర్మాణం కోసం 30కోట్ల రూపాయలను మంజూరు చేశారని చెప్పారు. స్పైస్ పార్క్ ద్వారా పసుపు, మిర్చి తదితర పంటలు సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని, రైతులు విక్రయించుకోగా మిగిలిన పంట ఉత్పత్తులను నాణ్యమైన పద్ధతుల్లో పౌడర్‌గా తయారు చేసి విక్రయాలు జరపాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. దీనికోసం అదనంగా మరో 10కోట్ల రూపాయలను కేటాయించేందుకు కూడా సీఎం సంసిద్ధత వ్యక్తం చేశారని మంత్రి పోచారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు కేంద్రం నుండి కూడా తోడ్పాటు అందితే రైతులకు పూర్తిస్థాయిలో మద్దతు ధర లభించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. రైతులు అధిక దిగుబడులు సాధించడంతో పాటు, పూర్తిస్థాయిలో గిట్టుబాటు ధర పొందగల్గినప్పుడే వారు ఆత్మగౌరవంతో బ్రతుకుతారని అన్నారు. కాగా, పామాయిల్ సాగుకు జిల్లాలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున ఔత్సాహిక రైతులు ముందుకు వచ్చినట్లయితే వారిని క్షేత్ర సందర్శన కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటకు పంపిస్తామని అన్నారు. పామాయిల్ పంట ఏడాది పొడుగునా వస్తుందని, క్వింటాలుకు 10వేల రూపాయల ధర లభిస్తుందన్నారు. కాగా, కేంద్రం మద్దతు ధర ప్రకటించిన పంటలకే ప్రస్తుతం రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గత ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 5,400 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 8,500కోట్ల రూపాయల విలువ చేసే 58లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందన్నారు. అదేవిధంగా మొక్కజొన్న, సోయాబీన్ కేంద్రాలను ఏర్పాటు చేసి 28లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని వివరించారు. రాష్టవ్య్రాప్తంగా 85 కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన పంటలకు సంబంధించి రైతులకు ఆన్‌లైన్ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని, దీనిని గమనించిన కేంద్రం మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తోందన్నారు. ప్రస్తుత రబీలో నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా 2.10లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా చర్యలు తీసుకున్నామని, చివరి ఆయకట్టువరకు నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎ.పీ బీబీ.పాటిల్, డీసీసీబీ చైర్మెన్ గంగాధర్‌రావు పట్వారి, ఎంపీపీ సులోచన, జడ్పీటీసీ శంకర్, డీసీసీఓ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్‌హుస్సేన్, ఉద్యానశాఖ ఉప సంచాలకులు సునంద, పోతంగల్ సర్పంచ్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.