నిజామాబాద్

ప్రజలందరినీ వీరప్ప స్వామి చల్లగా చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోమకొండ, జనవరి 22: కురుమ కులస్థుల ఆరాధ్యదైవమైన వీరప్ప స్వామి ప్రజలందరినీ చల్లగా చూడాలని ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ అన్నారు. సోమవారం మండలంలోని లింగుపల్లి గ్రామంలో జరుగుతున్న వీరప్ప స్వామి కల్యాణానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. విప్‌తో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ డాక్టర్. సత్యనారాయణను కురుమ కుల సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం సంఘ ప్రతినిధులకు విప్, కలెక్టర్‌లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, అన్నికులాల వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ద చేస్తుందన్నారు. కురుమగొల్ల కులస్థులకు ఇందులో భాగంగానే గొర్లు మేకలను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగు బాలరాజవ్వ, జడ్పీటీసీ గండ్ర మధుసూధన్ రావు, ఏఎంసి వైస్ చైర్మెన్ శేకర్, సొసైటీ చైర్మెన్ నర్సారెడ్డి, ఎంపీటీసీలు పోచయ్య, నాగరాజు రెడ్డి పాల్గొన్నారు.

నిద్రలోనే మృత్యు ఒడిలోకి చేరిన లారీ డ్రైవర్
డిచ్‌పల్లి రూరల్, జనవరి 22: హైదరాబాద్ నుండి నాగ్‌పూర్‌కు లోడ్‌ను తీసుకెళ్తున్న ఓ లారీ డ్రైవర్ మార్గమధ్యంలో అనారోగ్యానికి గురై, సేదతీరుతున్న సమయంలోనే నిద్రలోనే మృత్యు ఒడిలోకి చేరిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. డిచ్‌పల్లి ఎస్‌ఐ పూర్ణేశ్వర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన లారీడ్రైవర్ విజయ్ హైదరాబాద్ నుండి నాగ్‌పూర్ బయలుదేరి వెళ్తున్నాడనని ఎస్‌ఐ తెలిపారు. అయితే విజయ్ ఒక్కసారి అనారోగ్యానికి గురికావడంతో ఆదివారం రాత్రి డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీబీపూర్‌తండా జాతీయ రహదారిపై ఉన్న ఓ దాబా ప్రక్కన లారీ నిలిపి, తనకు ఆరోగ్యం సహకరించడం లేదని దాబా హోటల్ యజమానికి తెలిపి లారీలో నిద్రపోవడం జరిగిందన్నారు. సోమవారం ఉదయం లేచి చూసే సరికి లారీ డ్రైవర్ విజయ్ లారీలో నిద్రిస్తున్న ప్రదేశంలోనే విగత జీవితగా పడి ఉండటంతో తమకు సమాచారం అందించారని ఎస్‌ఐ పూర్ణేశ్వర్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.