నిజామాబాద్

తూతూమంత్రంగా కూల్చివేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, మార్చి 16: నగరంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా అక్రమంగా వెలిసిన రేకులషెడ్లను, దుకాణా సముదాయాల తొలగింపు కార్యక్రమాన్ని తూతుమంత్రంగా చేపడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేషన్ అధికారులు, పోలీసుల సహకారంతో అక్రమ కట్టడాల కూల్చివేతకు శ్రీకారం చుట్టగా, అక్రమార్కులకు రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో కూల్చివేసిన కొన్ని రోజులకే మళ్లీ నిర్మాణాలు చేపట్టడం శరామాములుగా మారుతోంది. గత కొన్ని మాసాల క్రితం నగరంలోని కంఠేశ్వర్ బైపాస్‌రోడ్డు చౌరస్తాలో ఏసీపీ ఉమాదేవి ఆధ్వర్యంలో అక్రమంగా నిర్మించుకున్న షెడ్డును తొలగింపజేయగా, నెల రోజులు తిరగకముందే మళ్లీ అదే ప్రదేశంలో నిర్మించుకోవడం జరిగింది. డ్రైనేజీలపై నిర్మించుకున్న ఆక్రమణలను కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించినా, కొద్ది రోజులకే తిరిగి ఆ ఆక్రమణలు వెలుస్తున్నాయి. ఇటీవలే నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో నగర పాలక సంస్థకు చేందిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఆక్రమణలను తొలగించారు. కానీ, నగరంలోని బస్టాండ్ ఎదుట గల పండ్ల దుకాణదారులు డ్రైనేజీలను ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్నా, అటువైపు టౌన్ ప్లానింగ్ అధికారులు కనె్నత్తి చూడకపోవడం గమనార్హం. అదే విధంగా నగరంలోని ఏ కాలనీ చూసినా ఆక్రమణలే కనిపిస్తాయి. కొన్ని చోట్ల రోడ్ల వెంట కాలినడకన వెళ్లాలంటేనే ఇబ్బందిగా మారుతోంది. అక్రమంగా దుకాణాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు రోడ్లను సైతం కబ్జా చేసుకుంటుండటంతో వాహనదారులకు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. రైల్వే స్టేషన్‌కు ప్రక్కన, ఎదురుగా చాలా రోజులుగా ఆక్రమణలు ఉన్నాయి. ఈ రహదారి గుండా ఆర్టీసీ బస్సులు గానీ, ఇతరాత్ర వాహనాలు వెళ్లాలన్నా చాలా కష్టంగా మారింది. దీంతో నాలుగైదు రోజుల క్రితం కమిషనర్ జాన్‌సాంసన్ ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగింపజేశారు. రైల్వే స్టేషన్ ఎదురుగా పోస్ట్ఫాస్ ప్రక్కనే ఉన్న షెడ్డులను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగింపజేశారు. అలాగే పోస్ట్ఫాస్‌కు కొద్ది దూరంలో కొంతమంది రోడ్డును ఆక్రమించుకుని పండ్ల దుకాణాలను ఏర్పాటు చేసుకోగా, వాటిలో కొన్నింటిని సైతం అధికారులు తొలగించడం జరిగింది. రెండున్నర సంవత్సరాల క్రితం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు కార్పొరేషన్ అధికారులు ప్రయత్నించగా, వ్యాపారులు అడ్డుపడి, వారితో వాగ్వాదానికి దిగారు. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి తమను దుకాణాలు వేసుకోవాలని సూచించడం జరిగిందని వ్యాపారులు చెప్పడం అధికారులకు ఆశ్చర్యానికి గురి చేసింది. అధికార పార్టీ నాయకులు సైతం వ్యాపారులకు మద్దతు పలుకుతుండటంతో ఆక్రమణల విషయంలో అధికారులు ఏమీ చేయలేక వెనుదిరిగి వెళ్తున్న సందర్భాలు సైతం చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం కూడా అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్లే ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించలేకపోతున్నామని కార్పొరేషన్‌కు చెందిన ఓ అధికారులు పేర్కొన్నారు. నగరంలోని ఏ కాలనీలో చూసినా ఆక్రమణలే దర్శనమిస్తాయి. ముఖ్యంగా బస్టాండ్ ఎదురుగా ఉన్న రోడ్డు(రమాదేవి ఆసుపత్రి లైన్), ఖలీల్‌వాడీ ప్రాంతంలో మొన్నటికి మొన్న ఆక్రమణలను తొలగించారు. కొన్ని రోజులకే మళ్లీ యధాతథంగా ఆ ప్రాంతంలో తోపుడుబండ్లు దర్శనమిచ్చాయి. వీటికి తోడు ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా వీక్లీ మార్కెట్‌కు వెళ్లే రోడ్డును సైతం కొబ్బరిబొండాలు, వస్త్రా దుకాణదారులు ఆక్రమించుకుని తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసుకోవడంతో అనునిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఇలా నగరంలోని అనేక ప్రాంతాలలో రోడ్లు ఆక్రమణలకు గురవుతుండటంతో ట్రాఫిక్ సమస్య రోజురోజుకీ జఠిలమవుతోంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

తెలుగు.. వెలుగు పుస్తకాన్ని ప్రతి ఇంటికి అందించాలి
* వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఇందూర్, మార్చి 16: రాష్ట్ర ప్రభు త్వం సంస్కృతి, సంప్రదాయాలతో పాటు అస్థిత్వాన్ని తెలియజేసేందుకు తెలుగు నూతన సంవత్సరం ఉగాది కానుకగా అందజేస్తున్న ‘తీయనైన తెలుగు-తెలంగాణ వెలుగు’ పుస్తకాన్ని శనివారం సాయంత్రం కల్లా ప్రతి ఇంటి కి అందించేందుకు అధికారులు చర్య లు తీసుకోవాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం ఎంపీడీఓలు, తహశీల్దార్లతో ఈ పుస్తకం పంపిణీపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో తహశీల్దార్లు, ఎంపీడీఓలు ఆయా మండలాల్లోని గ్రామ పంచాయతీలను ఎంపిక చేసుకుని, గ్రామస్థాయి అధికారుల ద్వారా పంపిణీ చేయాలన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, అంగన్‌వాడీ కార్యకర్త, వీఆర్‌ఓ, వయోజన విద్య వలంటీర్లు, కారోబార్లు, ఆశావర్కర్లుకు గృహాల వారిగా కేటాయించి ఈ పుస్తకాలను పంపిణీ చేయాలన్నారు. పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లకు సంబంధిత శాఖ అధికారుల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇక మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు సంబంధిత మున్సిపల్ కమిషనర్ పంపిణీ చేస్తారన్నారు. గ్రామస్థాయిలో పంపిణీకి వినియోగించుకునే సిబ్బందికి జిల్లా అధికారులు ఇప్పటికే తగు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత, తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలను ఆదేశించారు. అంతకు ముందు తీయనైన తెలుగు - తెలంగాణ వెలుగు పుస్తకాన్ని అధికారులతో కలిసి కలెక్టర్ రామ్మోహన్‌రావు ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ ఏ.రవీందర్‌రెడ్డి, పీడీఓ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.