నిజామాబాద్

సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, మార్చి 21: ఉద్యోగ, ఉపాధ్యాయులకు శాపంలా పరిణమించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాల్సిందేనని ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర చెర్మన్ కారెం రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్‌లో జరిగిన ఉద్యోగ సంఘాల జేఏసీ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతుండ డం వల్లే తాము అమలు చేస్తున్నట్టు కేంద్రం చెబుతోందన్నారు. దీన్ని దృష్టి లో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ సీపీఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎంతో క్రియాశీలకంగా నిలిచిందని, సకల జనుల సమ్మెను నిర్వహించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు దోహదపడ్డామన్నా రు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ తప్ప ఇతర ఏ సదుపాయా లు కల్పించలేదన్నారు. సాధించిన రాష్ట్రంలో ఉద్యోగులు 24గంటలు పని చేస్తున్నారని, అన్నిరంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వానికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఆసరా పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. ఇక రెవెన్యూ ఉద్యోగులు సమగ్ర సర్వే, భూ ప్రక్షాళనను విజయవంతం చేయడంలో చెమటోడుస్తున్నారని చెప్పారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కించపర్చే రీతిలో వ్యవహరించినా, ఉద్యోగులు తమవంతు సేవలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి కావస్తోందని, కానీ ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదని పెదవి విరిచారు. తెలంగాణ వస్తే సీపీఎస్ రద్దు అవుతుందని తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, అయినప్పటికీ ఇంతవరకు సీపీఎస్ విధానం రద్దు కాలేదన్నారు. ఈ విధానం వల్ల ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబానికి వేయి రూపాయలు లభించడం కూడా కష్టంగా మారిందన్నారు. రాష్ట్రాల అనుమతితోనే సీపీఎస్‌ను అమలు చేస్తున్నామని కేంద్రం కరాఖండీగా తేల్చి చెబుతున్నందున, సీపీఎస్‌ను రద్దు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం మిషన్ కాకతీయ తదితర పథకాలకు భారీగా నిధులు కేటాయిస్తోందని, అలాంటప్పుడు రాష్ట్ర ప్రగతి కోసం అహరహం శ్రమిస్తున్న ఉద్యోగులకు ఎందుకు సదుపాయాలు కల్పించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో రాష్ట్ర అభివృద్ధికి ఒక నెల వేతనం రూపంలో సుమారు 35కోట్ల రూపాయలను ఉద్యోగులు అందించడం జరిగిందని, అయినప్పటికీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సరైన న్యాయం చేయడం లేదని ఆక్షేపించారు. ప్రభుత్వం వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి ఇదివరకటి తరహాలోనే ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా విద్యుత్ శాఖ అధికారులు రాష్ట్రంలో 24గంటల విద్యుత్ సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రజలకు, రైతులకు విద్యుత్‌ను అందిస్తున్నారని, వారికి మరిన్ని ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తమ సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినప్పటికీ, ఉన్నతాధికారులు స్పందించడం లేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులంతా ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ నెల 25వ తేదీన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, జిల్లాలోని ఉద్యోగులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్, ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, గంగాధర్, ఆనంద్, మహిళా విభాగం అధ్యక్షురాలు సునీత తదితరులు పాల్గొన్నారు.