నిజామాబాద్

గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెనోటీసు అందజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాంసాగర్, జూలై 21: గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెను, ఈనెల 23వ తేది నుంచి నిర్వహింస్తున్నామని డిమాండ్ చేస్తూ, శనివారం ఎంపీడీఓ తోట పర్భన్న, ఎస్‌ఐ ఉపేందర్‌రెడ్డికి కార్మికులు సమ్మెనోటీసును అందజేశారు. ఈసందర్భంగా గ్రామపంచాయతి ఉద్యోగ కార్మిక సంఘం మండల అధ్యక్షులు జంగం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి సాయులు మాట్లాడుతూ, గ్రామపంచాయతి ఉద్యోగ కార్మికుల న్యాయమైన డిమాండ్‌లే ఉన్నాయని, వీటిని వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. గ్రామాలలోని ప్రజలకు అందుబాటులో ఉండి, ఎన్నో సేవలు అందిస్తున్నామని, కష్టానికి ఫలితంగా వేతనం ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆవేధన వ్యక్తం చేశారు. 010 పద్దుద్వారా గ్రామపంచాయతి కార్మికులకు వేతనాలు విడుదల చేసేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలుతీసుకోవాలన్నారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈకార్యక్రమంలోగ్రామపంచాయతి ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు గంగారాం, లక్ష్మణ్, అంబయ్య, భీమయ్య, బాలయ్య, శివరాజులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు
మండల కేంద్రంలోని స్థానిక జవహర్ నవోదయ విద్యాలయంలో, హరితహారం పథకం కింద శనివారం స్థానిక ఎంపీడీఓ తోట పర్బన్న, జెన్‌వి ప్రిన్స్‌పాల్ శేఖర్‌బాబు, అచ్చంపేట్ సర్పంఛ్ గుమస్తామాణెమ్మ, ఈజీఎస్ ఏపీఓ సుదర్శన్ మొక్కలను నాటారు. విద్యాలయంలో 1500 మొక్కలను నాటేందుకు లక్ష్యం పెట్టుకున్నామని అన్నారు. వీటిలో 800 మొక్కలను నాటడం జరిగిందని,ప్రిన్స్‌పాల్ శేఖర్‌బాబు తెలిపారు. ఉసిరి, దానిమ్మ, కానుగ, టేకు, నమిల నారు తదితర మొక్కలను నాటడం జరగిందన్నారు. మిగితా మొక్కలను రెండు రోజుల్లో నాటుతామన్నారు. ఈకార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు గైని విఠల్, నాయకులు గంగారెడ్డి, గుమస్తాశ్రీనివాస్, రాములు, సంగమేశ్వర్‌గౌడ్, పంచాయతి కార్యదర్శి వీరభధ్రయ్య, టీఏలుప్రభాకర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.