నిజామాబాద్

ప్రైవేట్ విద్యా సంస్థలు సమ్మెను విరమించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఏప్రిల్ 29: ప్రైవేట్ విద్యా సంస్థలు సమ్మెను విరమించుకుని ప్రభుత్వం నిర్వహించే టెట్, ఎంసెట్, ఇంజనీరింగ్ పరీక్షలకు సహకరించాలని ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి కోరారు. శుక్రవారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యా విధానంలో సమూల మార్పులను తీసుకు వస్తున్నారని అన్నారు. ప్రతి విద్యార్థి విద్యాలయాలకు వెళ్లాలని, అందులో భాగంగానే సిబిఎస్‌ఇ విధానాన్ని అమలు చేసి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో కూడా విద్యా విధానంపై లఘు చర్చ కూడా జరిగిందని గుర్తు చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలు సాంకేతికంగా బాగా లేవనే ఉద్దేశ్యంతో సుమారు 320 ఇంజనీరింగ్ కాలేజీలను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. అలాగే తెలంగాణలోని ఆయా యూనివర్శిటీల్లో విద్యా విధానం ఘోరంగా ఉందన్నారు. అందులో భాగంగానే ఈ నెల 8న ఎస్‌ఎస్‌సి, ఇంటర్, యూనివర్శిటీల్లో నాణ్యమైన విద్యను అందించడం లేదని సిఎం కెసిఆర్ ఒక సమావేశాన్ని సైతం విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారని తెలిపారు. సరైన నిబంధనలు లేకపోవడమే విద్యా విధానం కుప్పకూలడానికి కారణమవుతోందని అభిప్రాయపడ్డారు. ఆయా కళాశాలల్లో వౌలిక సదుపాయాలు సరిగా లేవన్నారు. అందువల్లే పది రోజుల క్రితం విజిలెన్స్, ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలోనే కళాశాలల్లో తనిఖీలు చేయించారని చెప్పారు. ఈ తనిఖీలకు నిరసనగా ప్రైవేట్ విద్యా సంస్థలు ఎంసెట్, ఇంజనీరింగ్ పరీక్షలను బహిష్కరించాయని, వీరి వెనుక టి.కాంగ్రెస్ నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. కళాశాలల్లో వౌలిక సదుపాయాలకే ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ తనిఖీలను ఆపేది లేదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించేందుకు వీలుగా ప్రభుత్వం 3060 కోట్ల రూపాయలను ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద విడుదల చేసిందన్నారు. కళాశాలల్లో తనిఖీలను ఒయు, ఇతర విద్యార్థి సంఘాలు స్వాగతిస్తున్నాయని, ప్రైవేట్ విద్యా సంస్థలు కొన్ని ముమ్మాటికీ దోపిడీకి పాల్పడుతున్నాయని భూపతిరెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా ప్రైవేట్ విద్యా సంస్థలు ఎంసెట్, ఇంజనీరింగ్ పరీక్షలకు సహకరించాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆంగ్ల మాధ్యమంను ప్రవేశపెడుతున్నారని చెప్పారు. భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం 1500కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందన్నారు. విద్యా సంస్థల్లో బయోమెట్రిక్ పద్ధతిని ప్రవేశపెట్టనుందని తెలిపారు. కోదండరాం నేతృత్వంలో టిజెఎసి లేనేలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.

.