నిజామాబాద్

పొంగిపొర్లుతున్న మత్తడి ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, ఆగస్టు 17: మోర్తాడ్ మొండివాగు మత్తడి ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. మండలంలోని పాలెం, తొర్తి, తిమ్మాపూర్ గ్రామాలకు నీటిని అందించేందుకు మూడు దశాబ్దాల క్రితం చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఈసారి తొలిసారిగా జలకళ సోకింది. గడిచిన రెండు సంవత్సరాలుగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో ప్రాజెక్టులోకి నీటి నిల్వలు చేరలేదు. ఈసారి సీజన్ ప్రారంభంలో భారీ వర్షాలు కురిసినా, ప్రాజెక్టులోకి నీరు లేరలేదు. అయితే గడిచిన రెండు రోజులుగా భారీ వర్షం కురియడంతో ప్రాజెక్టులోకి వరద జలాలు వచ్చి చేరాయి. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని కమ్మర్‌పల్లి మండలంతో పాటు ఒడ్యాట్ పరివాహక ప్రాంతంలో వర్షాలు భాగా కురియడంతో జలాలన్నీ ప్రాజెక్టులోకి మళ్లాయి. దీంతో ప్రాజెక్టు నిండుకుండా మారి, మిగులు జలాలన్నీ ఆనకట్ట పైనుండి పొంగిపొర్లుతూ మొండివాగు ద్వారా వరదకాల్వలోకి మళ్లిపోతున్నాయి. ప్రాజెక్టు నుండి తిమ్మాపూర్, పాలెం, తొర్తి గ్రామాలకు నీటిని మళ్లించే పంట కాల్వలు లోపభూయిష్టంగా ఉండటంతో చుక్కనీరు కూడా లబ్ధి గ్రామాలకు చేరే అవకాశం లేకుండాపోయింది. ప్రాజెక్టు గేట్ల నుండి నీరు కాల్వలోకి మళ్లుతున్నా, కొంత దూరం వరకే పరిమితమవుతున్నాయి. దీంతో ప్రాజెక్టు జలాలన్నీ వృధాగా మొండివాగు ద్వారా పెద్దవాగులోకి మళ్లి తడ్‌పాకల్ గోదావరిలోకి మళ్లేందుకు పరుగులు తీస్తున్నాయి. మొండివాగు మత్తడి ప్రాజెక్టు నిండి పొంగిపొర్లుతుండటంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.