నిజామాబాద్

విదేశీ వర్సిటీలను అనుమతించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఏప్రిల్ 30: విద్యారంగంలో విదేశీ యూనివర్శిటీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించ వద్దని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకట్‌గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో నిర్వహిస్తున్న విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులకు శనివారం ఆయన హాజరై మాట్లాడారు. విద్యారంగంలో విదేశీ యూనివర్శిటీలను ఆహ్వానిస్తూ స్వదేశీ సంస్థలను అన్యాయం చేస్తున్నారని అన్నారు. పాలకులు విద్యను వ్యాపార దృష్టితో చూస్తూ ఈ రంగాన్ని విదేశాలకు అప్పగిస్తున్నాయని దుయ్యబట్టారు. పెట్టుబడిదారులకు కొమ్ముగాస్తూ విశ్వవిద్యాలయాలను విదేశాలకు స్థానం కల్పించడం ఎంతో ప్రమాదకరమని పేర్కొన్నారు. దీనివల్ల స్వదేశీ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు చోటు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్శిటీలో కాషారుూకరణను చొప్పించేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.