నిజామాబాద్

నిర్విఘ్నంగా ’మిషన్ భగీరథ‘

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 30: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనులు జిల్లాలో మరింత వేగవంతం అవుతాయని స్థానికులు ఆశిస్తున్నారు. మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా జిల్లాకు చెందిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని నియమించడంతో సొంత జిల్లాలో పనులను పరుగులు పెట్టిస్తారని భావిస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే వేముల ప్రశాంత్‌రెడ్డి సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో వాటర్‌గ్రిడ్ పనులపై సమీక్ష జరిపారు. ఈ క్రమంలోనే సొంత జిల్లాలో కొనసాగుతున్న పనుల తీరుపై కూడా ఆయన అధికారులతో త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేయనున్నారని తెరాస వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే వివిధ దశల్లో కొనసాగుతున్న వాటర్ గ్రిడ్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, ప్రభుత్వ ఆశయం మేరకు ఇంటింటికి రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని జిల్లా యంత్రాంగం పట్టుదలను కనబరుస్తోంది. తొలి దఫాలో వచ్చే జూన్ నెలాఖరు నాటికి జిల్లాలోని 121 గ్రామాలకు వాటర్ గ్రిడ్ ద్వారా శుద్ధి జలాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఒక్కొక్కరికి రోజుకు 40లీటర్ల చొప్పున నీటిని అందిస్తుండగా, వాటర్ గ్రిడ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రతి ఒక్కరికి సగటున వంద లీటర్ల చొప్పున నీటిని అందించాలని తలపోస్తున్నారు. అటవీ భూములు ఉన్న 77గ్రామ పంచాయతీల్లో వాటర్ గ్రిడ్ పనులు చేపట్టేందుకు అనుమతులు లభించగా, మరో 34చోట్ల క్రాసింగ్‌లు, జాతీయ రహదారులు కలిగిన ప్రాంతాల్లో 35 మలుపుల వద్ద కూడా పనులు చేపట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. జిల్లాలోని మొత్తం 718గ్రామ పంచాయతీలకు మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా శుద్ధి జలాలు అందించేందుకు శ్రీరాంసాగర్, మంజీరా నీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించుకుని పనులు చేపడుతున్నారు. జిల్లాలో సుమారు 2700కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనాలు రూపొందించారు. ఎస్సారెస్పీ నీటిని ఆధారంగా చేసుకుని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 860గ్రామాలకు తాగునీటిని అందించేందుకు 1350కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు. బోధన్, జుక్కల్, బాన్సువాడతో పాటు ఎల్లారెడ్డిలోని కొంత భాగాన్ని కలుపుతూ మిగతా 745గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం సింగూరు నీటిని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. సుమారు 1300కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ పనులను మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కంపెనీ దక్కించుకుని పనులు చేపడుతోంది. హెడ్ వర్క్ నిర్మాణం పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తవగా, ఓహెచ్‌బిఆర్, వాటర్ సంప్ పనులు చేపడుతున్నారు. వీటితో పాటు ఎస్సారెస్పీకి చేరువలో ఉన్న బాల్కొండ మండలంలోని జలాల్‌పూర్ గ్రామం వద్ద 41.11కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇంటెక్‌వెల్ బావి నిర్మాణం పనులు జరిపిస్తున్నారు. ఈ పనులన్నీ రెండు నుండి రెండున్నరేళ్ల కాల వ్యవధిలోపు పూర్తి చేయాలని గుత్తేదార్లతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, మొదటి విడతగా 121గ్రామాలకు జూన్ నెలాఖరులోపే శుద్ధి జలాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని 1645 ఆవాస ప్రాంతాల్లో గల 25.51లక్షల మంది జనాభాకు ప్రతి ఒక్కరికి రోజుకు కనీసం వంద లీటర్ల శుద్ధి చేసిన నీటిని అందించనున్నారు. పోచంపాడ్ గ్రిడ్‌ను 2017 అక్టోబర్ నాటికి, సింగూర్ గ్రిడ్‌ను 2018 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదార్లకు గడువు విధించారు. వాటర్ గ్రిడ్ పనులకు ఏ దశలోనూ ఆటంకాలు తలెత్తకుండా సాఫీగా పనులు ముందుకు సాగాలనే ఉద్దేశంతో అన్ని శాఖలను సమన్వయపరుస్తూ జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.