నిజామాబాద్

పుస్తకం ఓ ఆయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఏప్రిల్ 30: జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా కొనసాగుతున్న తొగర్ల సురేష్ రచించిన ‘మన కోసం..’ పుస్తకాన్ని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి ఆవిష్కరించారు. పోలీసుల సాధక బాధకాలను సమాజం దృష్టికి తెచ్చేలా ‘పోలీస్ గృహిణి ఎలా ఉండాలి, బందోబస్తులు - బారెడు దుఃఖాలు, ఓ పోలీస్ భార్య, సెల్‌ఫోన్ ప్రభావం, నేటి యుగంలో పెళ్లిళ్ల సమస్యలు, నాన్న, ఓ గొప్ప వరం అమ్మ, అత్తారింట్లో పెళ్లికూతురు, దినదిన గండం పోలీసు ఉద్యోగం, ఆడపిల్ల, ఉషస్సు తదితర శీర్షికలతో 26అంశాలపై చేసిన రచనలను భావన సాహితీ సాంస్కృతిక సామాజిక సంస్థ ఆధ్వర్యంలో పుస్తకం రూపంలో వెలువరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సామాజిక పునర్జీవనంలో వచ్చే మార్పులపై బలమైన శక్తిని చూపే అసాధారణ ఆయుధం పుస్తకమని పేర్కొన్నారు. పోలీసుల సాధకబాధకాల గురించి ఇతరులకు తెలియజేసేందుకు ఈ పుస్తకం ఎంతగానో దోహదపడుతుందని తొగర్ల సురేష్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆర్.ప్రతాప్‌రెడ్డి, ట్రాఫిక్ సిఐ శేఖర్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ డి.కిషన్, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకీల్‌పాషా, భావన సాహితీ సాంస్కృతిక సామాజిక సంస్థ అధ్యక్షుడు పడాల రామారావు తదితరులు పాల్గొన్నారు.
పదవీ విరమణ చేసిన ఎస్‌ఐకు సన్మానం
ఇందూర్: నిజామాబాద్ సిసిఎస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన బి.పండరిని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి వీడ్కోలు సమావేశంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో ఎంతో పని ఒత్తిడితో విధులు నిర్వర్తించి, ఎలాంటి రిమార్కు లేకుండా సర్వీసును పూర్తి చేసుకోవడం గొప్ప విషయమని అన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ సహజమని, రిటైర్ అయిన పోలీసు సిబ్బందికి తమ శాఖ తరఫున ఎల్లవేళలా సహాయ, సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ డి.కిషన్, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకీల్‌పాషా పాల్గొన్నారు.