నిజామాబాద్

విత్తనశుద్ధితో తెగుళ్ల నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, ఏప్రిల్ 30: రైతులు విత్తన శుద్ధి చేయడం ద్వారా అనేక లాభాలు పొందవచ్చని, ప్రధానంగా పంటలకు ఆశించే తెగుళ్ల బారి నుండి వాటిని కాపాడుకోవచ్చని రైతు శిక్షణ కేంద్రం డిడిఎ నర్సింహచారి అన్నారు. మోర్తాడ్ మండలం శెట్పల్లి, ధర్మోరా గ్రామాల్లో శనివారం జరిగిన మన తెలంగాణ - మన వ్యవసాయం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. శుద్ధి చేసిన విత్తనాల వల్ల వాటి వేర్లకు, పంటకు సోకే తెగుళ్లను పూర్తిస్థాయిలో అరికట్టవచ్చని అన్నారు. ప్రధానంగా సోయాబీన్ విత్తనాలను శుద్ధి చేస్తే వేరు బుడిపెలు ఎక్కువగా వృద్ధి చెంది, వాటిలో ఉండే రైజోబియమ్ బ్యాక్టీరియా ద్వారా వాతావరణంలోని నత్రజనిని మొక్కకు అందిస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల సోయాబీన్ పంటలో అధిక దిగుబడి పొందవచ్చని అన్నారు. చాలామంది రైతులు ఈ పంటలో పైపాటుగా యూరియా పోస్తారని, దానిని మానుకోవాలని సూచించారు. ప్రస్తుతం వేసవిలో ఎలాంటి పంటలు సాగు చేయని దృష్ట్యా, పంట భూముల్లో లోతు దుక్కులు తీయాలని, దీనివల్ల పంటలను ఆశించే తెగుళ్లు, పురుగుల గుడ్లు, లార్వాలు ఎండ వేడిమికి చనిపోతాయని అన్నారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని ఆయన కోరారు. భూసారం పెంపుదలకు గాను ప్రభుత్వం యాభై శాతం సబ్సిడీపై జీలుగ, జనుము వంటి పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేస్తోందని, ప్రస్తుతం ఈ విత్తనాలను పంట భూముల్లో సాగు చేయడం ద్వారా రెండు నెలల్లో పంట ఏపుగా పెరుగుతుందని, దానిని భూమిలోనే దునే్నస్తే భూసారం పెరుగుతుందని తెలిపారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు లింబాద్రి, రాజేందర్‌ల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపిటిసిలు లింబాద్రి, లత, వ్యవసాయ అధికారిణి లావణ్య, ఎఇఓలు గంగాధర్, అరుణ, పశువైద్యాధికారి గంగప్రసాద్, రైతులు పాల్గొన్నారు.