నిజామాబాద్

వేతనాలు చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయక్‌నగర్, ఏప్రిల్ 30: బీడీ యాజమాన్యాలు నలభై రోజుల పాటు కంపెనీలను మూసివేసినందున బీడీ కార్మికులకు సంబంధిత రోజులకు వేతనాలు లెక్కించి పూర్తిస్థాయిలో చెల్లించాలని తెరాస పొలిట్ బ్యూరో సభ్యుడు, తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎఎస్.పోశెట్టి డిమాండ్ చేశారు. శనివారం నాడిక్కడ ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీడీ యాజమాన్యాలు ఎలాంటి ముందస్తు నోటీసులు అందించకుండానే చట్ట విరుద్ధంగా కంపెనీలను మూసి వేయడం వల్ల 7లక్షల మంది బీడీ కార్మికులు పని దినాలు కోల్పోయి తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. ఇందుకు యాజమాన్యాలే బాధ్యత వహిస్తూ కంపెనీలు మూసి ఉంచిన 40రోజులకు సంబంధించిన వేతనాలను కార్మికులకు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం 70శాతం వరకు బీడీ కంపెనీలు తెరిచారని, మిగతా ముప్ఫై శాతం బీడీ కంపెనీలను కూడా సత్వరమే తెరిచి కార్మికులందరికీ పని కల్పించాలని డిమాండ్ చేశారు.
బీడీ కట్టలపై 85శాతం మేర పుర్రె, క్యాన్సర్ గుర్తు బొమ్మలను ముద్రించాలనే ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. ఈ మేరకు కేంద్రంపై తెరాస ప్రభుత్వం, తమ పార్టీ ఎంపిలు ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. అయితే ఆంక్షలను సాకుగా చేసుకుని బీడీ యాజమాన్యాలు కార్ఖానాలను చట్టవిరుద్ధంగా మూసివేస్తే కార్మికులు ఉపాధిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉన్నందున కంపెనీల మూసివేత ఆలోచనలకు స్వస్తి చెప్పాలన్నారు.