నిజామాబాద్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 30: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పుల సంఖ్యను మరింతగా పెంచేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ యోగితారాణా ఐసిడిఎస్, వైద్యారోగ్య శాఖల అధికారులకు సూచించారు. ఇదివరకు ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు కేవలం 15శాతానికే పరిమితం అవగా, ఏప్రిల్ నెలలో 45శాతానికి పెరిగాయని అధికారులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో పని చేస్తూ మే నెలలో ప్రసవాల సంఖ్యను 60శాతానికి చేర్చాలని లక్ష్యం విధించారు. శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా పిహెచ్‌సిల వైద్యాధికారులు, ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు, సిడిపిఓలు, ఎస్‌పిహెచ్‌ఓలు, ఐకెపి ఎపిఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏప్రిల్ మాసంలో జిల్లాలో మొత్తం 3218 ప్రసవాలు జరుగగా, వాటిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1440 కాన్పులు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1778 కాన్పులు జరిగాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన వాటిలో 945 సాధారణ ప్రసవాలుండగా, 495 సిజేరియన్లు ఉన్నాయన్నారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం 1359 సిజేరియన్లు కాగా, కేవలం 357మాత్రమే నార్మల్ డెలివరీలు అయ్యాయని, ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సగటున చూస్తే 76శాతం వరకు సిజేరియనే్ల ఉంటున్నాయని, ఇందుకు గల కారణాలను అనే్వషిస్తూ వాటి సంఖ్యను తగ్గించడం ద్వారా డెలివరీల సమయంలో ప్రజలపై ఆర్థిక భారం పడకుండా చూడవచ్చని అన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల గర్భిణీలు సుఖ ప్రసవాల కోసం నూటికి నూరు శాతం ప్రభుత్వాసుపత్రులకే వచ్చేలా చూడాలన్నారు. ఈ మేరకు ముందుగానే బర్త్ ప్లాన్‌ను రూపొందించుకుని గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ చేయాలని వైద్య సిబ్బంది, ఐసిడిఎస్ సిబ్బందిని ఆదేశించారు. మార్పు కార్యక్రమం లక్ష్యాలకు అనుగుణంగా పిహెచ్‌సిలలో ప్రసవాలు జరిగిన తీరును బట్టి ఐసిడిఎస్ సూపర్‌వైజర్ల పనితీరును మదింపు చేయనున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు.