నిజామాబాద్

కామారెడ్డిలో గాలి వానతో కూడిన వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, మే 3: అల్పపీడన ద్రోణి వల్ల మంగళవారం సాయంత్రం 5.30గంటల నుండి 6గంటల వరకు కామారెడ్డి పట్టణంలోని భారీ వర్షం పడింది. ఉదయం నుండి మండుటెండలు జనాలను ఉక్కిరి బిక్కిరి చేశాయి. మండుతున్న ఎండల్లో నుండి నల్లని మబ్బులతో ఆకాశం అంతా కమ్ముకుని, ఉరుములు, మేరుపులతో కూడిన భారీ వర్షం అరగంటపాటు పడటంతో పట్టణంలో వేడి వాతావరణం చల్లబడింది. భారీ వర్షంతో పట్టణంలోనీ రైల్వేస్టేషన్ రోడ్డులో వర్షపునీరు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్డుపైనే నిలిచి పోవడంతో పాదాచారులు, వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. వర్షపునీరు నిలిచి పోవడంతో వేగంగా అందులోంచే వాహనాలు వెళ్తుండటంతో జనాలపై రోడ్డుపైన ఉన్న నీరు పడి అనేక ఇబ్బందులు పడ్డారు. పలువురు వాహనాదారులను దూషించుకుంటూ వెళ్లడం కన్పించింది. ఇక పోతే పట్టణంలోని ప్రియాటాకిస్ రోడ్డులోని ప్రియాటాకిస్ ఎదురుగా రోడ్డు గుంతల మయంగా ఉండటంతో రోడ్డుపై నీరు నిలిచి ఆ ప్రాంతం అంత బురధ మయంగామారింది. అదే సమయంలో టాకిస్‌లో సినిమా చూసి బయట వచ్చిన ప్రేక్షకులు సైతం బురదనీళ్లలోంచే వెళ్లాల్సి వచ్చింది. ఇంతే కాకుండా కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయానికి, కోర్టుకు వెళ్లే రోడ్డు సైతం బురధ గుంటగా మారింది. స్టేషన్‌రోడ్డుతో పాటు బతుకమ్మ కుంట, అయ్యప్పనగర్, శ్రీరామ్‌నగర్, కాలనీ, ఎన్‌జిఓ కాలనీ, బాలుర పాఠశాల తదితర కాలనీల్లో చిన్నపాటి వర్షాలకే రోడ్లన్ని చిత్తడి చిత్తడి అవుతూ ప్రజలకు ఇబ్బంది కరంగా మారాయి. అసలే రోడ్లన్ని గుంతల మయంగా ఉండటంతో చిన్న పాటి వర్షాలకు గుంతల్లో నీరు నిలిచిపోయి ప్రజలకు ఇబ్బంది కల్గిస్తున్నాయి. గత మూడు రోజులుగా కామారెడ్డి పట్టణంలో కాసేపు వర్షం పడుతూ, మూడవ రోజు భారీ వర్షంతో ఈ ప్రాంత వాతావరణం వేడి నుండి ఉపశమనం పొందుతోంది. ప్రియాటాకిస్ రోడ్డులో భారీ వర్షంతో ఇండ్లపై నుండి ధారగా పడ్తున్న వర్షపునీటిని కొందరు వృధా పొకుండా బకేట్లు, బ్యారల్స్‌లో నింపుకోవడం కన్పించింది. అసలే పట్టణంలో తీవ్ర నీటి కొరత ఉండటంతో వర్షపు నీటిని ఆనందంగా పట్టుకోవడం కన్పించింది. ఇంతే కాకుండా చిన్నారి పిల్లలలు కాగితపు పడవలు చేసుకుని కాల్వల పారుతున్న నీటిలో వేస్తూ వర్షంలో తడుస్తు వర్షాన్ని ఎంజాయ్ చేశారు. గత మూడు రోజులుగా ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంటే, విద్యుత్ సరఫరాకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మూడవ రోజు కూడా వర్షం ప్రారంభం కావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి గంట తరువాత విద్యుత్‌ను వర్షం తగ్గిన తరువాతనే పునరుద్దరించడం గమనార్హం. ఏది ఏమైనా కామారెడ్డి పట్టణ ప్రజలకు ఈ వర్షం వేడి నుండి ఉపశమనం కల్గించడంతో వారి ముఖాల్లో ఆనందం కన్పిస్తుంది.