నిజామాబాద్

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, మే 3: గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాన్పులు చేయించుకునేలా వారికి అవగాహన కల్పించాలని డిఎంహెచ్‌ఓ వెంకట్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో మార్పు పథకంలో బాగంగా గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న శిబిరాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆశావర్కర్‌లతో సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీలు గర్భం దాల్చినప్పటి నుంచి కాన్పు అయ్యేంత వరకు వారికి నెల నెల వైద్య పరీక్షలు చేయించడం, ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పుచేయించుకునేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. కాన్పు కోసం 108 అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలన్నారు. కాన్పు కోసం కామారెడ్డి, బాన్స్‌వాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గర్భిణీ స్ర్తిలు కాన్పునకు నాలుగు రోజుల ముందు హెల్ప్‌డెస్క్‌లో పేరు నమోదు చేసుకుని ఆసుపత్రిలో చేరాలని సూచించారు. అవసరమైతే వారికి సీజెరియన్ ఆపరేషన్ సైతం ఉచితంగా చేయడం జరుగుతోందన్నారు. కాన్పుకోసం వచ్చిన గర్భిణీలకు వైద్యం అందించడంలో ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే మాత్రం శాఖాపరమైన చర్యలుతప్పవని హెచ్చరించారు. ఈసమావేశంలో డిఎంఅండ్‌హెచ్‌ఓతోపాటు స్థానిక ఎస్‌పిహెచ్‌ఓ డాక్టర్ డి.రవీందర్‌గౌడ్, మత్తమాల పిహెచ్‌సి వైద్యాధికారిణి డాక్టర్ అనిత, సిహెచ్‌ఓ మోతిలాల్, హెచ్‌ఇఓ చారి, హెల్త్‌సూపర్‌వైజర్‌లు సుధాకర్, మధుసుధన్, ఎఎన్‌ఎంలు, సిబ్బంది తదితరులు ఉన్నారు.