నిజామాబాద్

ప్రత్యామ్నాయం వైపు... సుగర్స్ కార్మికుల చూపు...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, మే 3:బోధన్ నిజాండెక్కన్ సుగర్స్ కర్మాగారంలో పనిచేసే కార్మికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడంలో నిమగ్నమయ్యారు. నాలుగు మాసాలుగా కర్మాగారం మూతపడి ఉండటం, చేయడానికి పనులు లేకపోవడంతో కార్మికులు ప్రైవేటు ఉద్యోగాల కోసం వెతకటం మొదలు పెట్టారు. ఈ కర్మాగారంలో దాదాపు 130 మంది పర్మనెంట్ కార్మికులు ఉన్నారు. వీరంతా కర్మాగారంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రైవేటు యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించడంతో చేసేదేమి లేక నెలల తరబడి స్తబ్దంగా ఉన్నారు. ఈ కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే తమకు భద్రత ఉంటుందని, చేతి నిండా పని ఉంటుందని భావించి వారు గత నాలుగు నెలలుగా ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. కానీ వీరి దీక్షలకు సర్కారులో ఎటువంటి కదలిక లేకపోవడం, డేల్టా యాజమాన్యం లేఆఫ్‌ను ఎత్తివేయక పోవడంతో కార్మికులు తమ కుటుంబాల పోషణ కోసం ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు మాసాలుగా ప్రైవేటు యాజమాన్యం వేతనాలు చెల్లించక పోవడంతో తమ కుటుంబాలు ఎలా పోషించుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే నిజాంసుగర్స్ కర్మాగారానికి పాత రోజులు వస్తాయని అనుకుంటే అసలు ఉద్యోగాలకే ఎసరు పడినట్లయ్యిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఎన్నికల సమయంలో వాగ్ధానం చేసిన ముఖ్యమంత్రి, నిజామాబాద్ ఎంపీ, తెరాస నాయకులు నేడు కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విషయమై చొరవ చూపడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. కర్మాగారంలో లే ఆఫ్ నోటీసు వేసి నాలుగు మాసాలు గడుస్తున్నా సర్కారులో స్పందన కనిపించడం లేదని దాంతో తాము ప్రత్యామ్నాయాల కోసం వెళ్లాల్సి వస్తోందని వారు పేర్కొంటున్నారు. ఈ కర్మాగారంలోని వివిధ విభాగాలలో సుధీర్ఘ కాలం పాటు పనిచేసిన కార్మికులు నేడు వివిధ దుకాణాలు, చిన్న చిన్న పరిశ్రమలు, ఇతర రంగాలలో పనిచేసేందుకు దారి కడుతున్నారు. ఈ కర్మాగారంలో పనిచేసిన 130 మంది కార్మికులలో కొందరు కార్మికులు పదవీ విరమణ పొందే సమయం ఆసన్నమయ్యింది. ప్రస్తుతం పదవీ విరమణ పొందే కార్మికులకు కనీసం సన్మానం చేసే వారు కరువయ్యారు. ఈ పరిస్థితులన్నింటిని బేరీజు వేసుకుంటున్న కార్మికులు తమ కుటుంబాలను పోషించుకునేందుకు, ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడేందుకు ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నారు. కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారినప్పటికీ ఏ ఒక్క నాయకుడు కూడా వారి పై కనికరం చూపడం లేదనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఆయా పార్టీల నాయకులు తాము కార్మికుల వెన్నంటి ఉంటామని సభలు, వేదికల సాక్షిగా స్పష్టం చేసినా వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వంపై ఎటువంటి ఒత్తిళ్లు మాత్రం తీసుకరాలేక పోతున్నారని చెప్పవచ్చు. అన్ని పార్టీల నాయకులు సమిష్టిగా ప్రభుత్వం దృష్టికి కార్మికుల పరిస్థితిని తీసుకెళ్లినట్లయితే ప్రభుత్వం స్పందించే అవకాశాలు ఉన్నాయి. ఈ కర్మాగారాన్ని రక్షించుకుని కార్మిక, కర్షక వర్గాలకు న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో ఉన్నప్పటికీ పట్టించుకునే వారు లేకపోవడంతో డెక్కన్ సుగర్స్ కార్మికులు ప్రైవేటు ఉద్యోగాల బాట పడుతున్నారు. నాలుగు మాసాలుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు సైతం ముగించే పరిస్థితి కనిపిస్తోంది. కార్మికులు ప్రత్యామ్నాల వైపు వెతుండటంతో ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు తీవ్రత తగ్గుతూ వస్తోంది. స్థానికంగా ఫ్యాక్టరీ కార్మికుల కోసం జరుగుతున్న రిలే నిరాహార దీక్షలలో ఎక్కువగా వామపక్ష పార్టీలకు చెందిన నాయకులే ఎక్కువగా కూర్చుంటున్నారు. దీక్షా శిబిరంలో కార్మికుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతూ వచ్చింది. ఈ పరిణామాల వలన రిలే దీక్షలకు సైతం స్వస్తి పలికే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.