నిజామాబాద్

ఊరూరా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సోమవారం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుపుకున్నారు. ఆయా రాజకీయ పార్టీలతో పాటు టీ.జేఏసీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జెండాలను రెపరెపలాడించారు. వామపక్ష పార్టీలకు అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాల నేతలు సదస్సులు నిర్వహించారు. బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి జాతీయ పతాకం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెరాస పార్టీ అధికారంలోకి రాకముందు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ ఆందోళనలు నిర్వహించిందని, అధికారంలోకి వచ్చాక ఈ విషయాన్ని విస్మరించడం శోచనీయమన్నారు. ఎంఐఎం పార్టీకి భయపడే ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని ఆరోపించారు. కర్నాటక, మహారాష్టల్రలో అక్కడి ప్రభుత్వాలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుండగా, స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా తెలంగాణలో మాత్రం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలను చేపట్టకపోవడం శోచనీయమన్నారు. త్వరలో జరుగనున్న ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్రంలోనూ అధికారంలోకి రావడం ఖాయమని, ఏటేటా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు యెండల లక్ష్మీనారాయణ, ధర్మపురి అరవింద్, ధన్‌పాల్ సూర్యనారాయణ, బస్వా లక్ష్మీనర్సయ్య, గంగోనె గంగాధర్, న్యాలం రాజు, మల్లేష్ యాదవ్, నారాయణ యాదవ్, నాగరాజు, రోషన్‌లాల్‌బొహ్రా తదితరులు పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ భవన్‌లో నిర్వహించిన విమోచన దినోత్సవం సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించగా, జావెద్ అక్రమ్, రాంభూపాల్, సుభాష్‌జాదవ్, బంటు బలరాం తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వల్లే తెలంగాణ కల నెరవేరిందని, అయితే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను అందించడంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమవుతోందని తాహెర్ ఆక్షేపించారు. తెలంగాణలో ప్రజా ధనాన్ని లూటీ చేస్తూ, కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగించారని అన్నారు. ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డారని, ప్రస్తుత ఎన్నికల్లో తెరాసకు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కాగా, తెరాస పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి గులాబీ శ్రేణుల నడుమ తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకున్నారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు బాగిర్తి బాగారెడ్డి జెండాను ఆవిష్కరించారు. సీపీఎం, సీపీఐ పార్టీలు రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం చుట్టగా, న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో విద్రోహ దినంగా పాటించారు. అదేవిధంగా పీడీఎస్‌యు నాయకులు సదస్సు ఏర్పాటు చేసి సెప్టెంబర్ 17ను తెలంగాణ విద్రోహ దినంగా ఎందుకు పరిగణించాలి అనే అంశాన్ని విద్యార్థులకు వివరించారు. జిల్లా కేంద్రంలోనే కాకుండా అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లో ఈ వేడుకలు జరుపుకున్నారు. విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసు సిబ్బందిని నియమించి, కట్టుదిట్టమైన నిఘాను కొనసాగించారు.

ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా పని చేస్తున్న తెలంగాణ సర్కార్‌

కంఠేశ్వర్, సెప్టెంబర్ 17: రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ సర్కార్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పని చేస్తోందని, అందుకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడమే నిదర్శనమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఆరోపించారు. సోమవారం నగరంలోని బీజేపీ కారాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, నైజాం ఆధీనంలో ఉన్న తెలంగాణకు స్వేచ్ఛ లభించలేదన్నారు. అందుకు కారణం తెలంగాణలోని హైదరాబాద్ సంస్థానం రజాకార్ల ఆధీనంలో ఉండటమేనని అన్నారు. తెలంగాణకు సైతం స్వాతంత్య్రం కావాలని ఈ ప్రాంత ప్రజలు నైజాం ప్రభువుపై ఉద్యమించగా, అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్ధార్ వల్లాబాయ్ పటేల్ కేంద్ర బలగాలను పంపించి హైదరాబాద్ సంస్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానంలో ఉన్న మహారాష్టల్రోని 5, కర్నాటకలోని 4తాలుకాలతో పాటు తెలంగాణ ప్రాంతానికి విముక్తి లభించిందన్నారు. ఆనాటి నుండి మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం నిర్వహించడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, టీఆర్‌ఎస్ అధికారం చేపట్టి నాలుగేళ్లు గడిచినా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. 2019ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు యెండల లక్ష్మినారాయణ, ధన్‌పాల్ సూర్యనారాయణ, బస్వా లక్ష్మినారాయణ, యెండల సుధాకర్, ధర్మపురి అరవింద్, సుగుణ తదితరులు పాల్గొన్నారు.