నిజామాబాద్

గణేష్, మొహర్రం పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిపేట, సెప్టెంబర్ 20: నందిపేట మండలంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర, మొహర్రం పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా పోలీసు కమిషనర్ కార్తికేయ సూచించారు. నందిపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం సమావేశం శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, మతాలకు అతీతంగా ప్రజలంతా గణేష్ నిమజ్జన శోభాయాత్రను, మొహఱ్రం పండుగ వేడుకలను కలిసి మెలిసి జరుపుకోవాలని కోరారు. సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారని, శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. గత సంవత్సరం గణేష్‌ల శోభాయాత్ర సందర్భంగా నందిపేటలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. సమాజంలో పోలీసులు ఒకరని, అనవసరంగా కేసులు పెట్టడం పోలీసుల పని కాదని, శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ప్రజలు ఆనందోత్సవాల మధ్య ఉండేలా చేయడమే పోలీసుల బాధ్యత అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దన్నారు. అనంతరం గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరిగే ప్రధాన వీధులను పరిశీలించి, వినాయక మండపాలను సందర్శించారు. పాత గణేష్ మండపంలో సీపీ కార్తికేయ ప్రత్యేక పూజలు చేశారు. అలాగే గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసే ఊరచెరువు, రఘుపతి చెరువులను సందర్శించి పరిశీలించారు. శోభాయాత్ర జరిగే ప్రధాన రోడ్లలో ఏర్పడిన గుంతలను మట్టితో పూడ్చివేయించాలని మండల అధికారులకు సీపీ సూచించారు. అలాగే విద్యుత్ సరఫరా విషయంలో ట్రాన్స్‌కో అధికారులు, గణేష్ మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ యమున, డీసీపీ శ్రీ్ధర్‌రెడ్డి, ఆర్మూర్ ఏసీపీ రాములు, ఎస్‌ఐ రాఘవేందర్, తహశీల్దార్ ఉమాకాంత్‌రావు, ఎంపీడీఓ నాగవర్ధన్, విద్యుత్ అధికారులు కాంతారావు, ముస్లిం, మైనార్టీ నాయకులు, మండపాల నిర్వాహకులు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.

అన్నదానంలో పాల్గొన్న రేంజ్ డీఐజీ శివశంకర్‌రెడ్డి
ఇందూర్, సెప్టెంబర్ 20: నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఓం గణేష్ మండలి వద్ద ప్రతిష్ఠించిన వినాయక విగ్రహానికి రేంజ్ డీఐజీ శివశంకర్‌రెడ్డి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపం ఆవరణలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో రేంజ్ డీఐజీ పాల్గొని స్వయం భోజనాలు వడ్డించారు. అలాగే చెవిటి, మూగ, అంధ విద్యార్థులతో కలిసి రేంజ్ డీఐజీ సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ, చెవిటి, మూగ పాఠశాల, గ్రేస్ ఆర్గనైజేషన్, యూ సామన్య ప్రజలు తదితర సంస్థలకు చెందిన విద్యార్థులతో పాటు ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ హెచ్.వెంకటేశ్వర్లు, సౌత్ రూరల్ సీఐ రఘు, టౌన్ సీఐ నరేష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

శోభాయాత్ర రూట్ పరిశీలించిన మేయర్
కంఠేశ్వర్, సెప్టెంబర్ 20: ఈ నెల 23న నిర్వహించే వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నగరంలోని ఆయా ప్రాంతాల్లో మేయర్ ఆకుల సుజాత పర్యటించి, రథయాత్ర కొనసాగే రోడ్డును పరిశీలించారు. ముందుగా దుబ్బా, లలితమహాల్ థియేటర్, కిసాన్‌గంజ్, గాంధీగంజ్, నెహ్రుపార్క్, పెద్దబజార్, కోటగల్లి, గాజుల్‌పేట్‌లను పరిశీలించి, ఖిల్లా సమీపంలోని రఘునాథ చెరువుకు చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ, గణేష్ నిమజ్జనోత్సవాన్ని ఈ నెల 23వ తేదీన నిర్వహిస్తున్నందున గుంతలుగా మారిన రోడ్లను పూడ్చివేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే వీధి దీపాలను బిగించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అటల్ పెన్షన్‌తో భవిష్యత్‌కు ఢోకా లేదు
బాల్కొండ, సెప్టెంబర్ 20: అటల్ పెన్షన్ యోజన పథకంలో నమోదు చేసుకోవడం వల్ల భవిష్యత్ జీవిత కాలానికి ఢోకా ఉండదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెర్కిట్ శాఖ మేనేజర్ ప్రదీప్‌కుమార్ అన్నారు. మండల కేంద్రమైన బాల్కొండలో ఎస్‌బీఐ కేఎస్‌కే బ్యాంకును ఆయన తనిఖీ చేసి, లావాదేవీలను పరిశీలించారు. అటల్ పెన్షన్ బాండ్లను ఖాతాదారులకు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ పథకంలో చేరడం వల్ల ప్రమాద బీమాతో పాటు నెలకు 1000నుండి 5000రూపాయల వరకు ప్రతినెలా పెన్షన్ సహాయం పొందవచ్చని అన్నారు. 18 ఏళ్ల నుండి 40 సంవత్సరాల్లోపు స్ర్తి, పురుషులు ఈ పథకానికి అర్హులని, వయస్సు ఆధారంగా 42 రూపాయల నుండి 210రూపాయల వరకు వాయిదాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు.